Chhaava Record: తండ్రి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాధినేతా పగ్గాలు చేపట్టి తన పాలనతో మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబుకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అంతేకాదు ఆయన్ని ముప్పుతిప్పలు పెట్టారు. అలాంటి వీర సింహం కుమారుడైన శంభాజీ జీవిత చరిత్ర భారతీయ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ఈ యేడాది మన దేశంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ‘ఛావా’ రికార్డులను నెలకొల్పింది.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ ముద్దుగా ఛావా అని పిలిచేవారు. ఛావా అంటే సింహం పిల్ల అని అర్ధం.శివాజీని సింహం అయితే.. ఆయన కుమారుడు సింహం పిల్ల ‘ఛావా’ అనే బిరుదు ఉంది. మొత్తంగా ఛావా ఓ పేరు కాదు.. ఓ ఎమోషన్ అని ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను చూసి చెప్పొచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నడుస్తుండగానే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అంతేకాదు అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉంది. ఇక ‘ఛావా’ సినిమా తెలుగులో కూడా సంచలన విజయం సాధించింది.
తాజాగా ఈ సినిమా మన దేశంలో హిందీ నెట్ వెర్షన్ రూ. 600 కోట్ల క్రాస్ చేసింది. హిందీలో ‘స్త్రీ 2’, ‘పుష్ప 2’ సినిమాల తర్వాత రూ. 600 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన మూడో చిత్రంగా ‘ఛావా’ రికార్డు క్రియేట్ చేసింది. ఇక బాలీవుడ్ లో బాక్సాఫీస్ పరంగా ఎన్నో రికార్డులను పాతర వేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. అంతేకాదు 2025 యేడాది గాను నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ మూవీ, బెస్ట యాక్టర్..సహా పలు విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు కొల్లగొట్టడం ఖాయం అని పలువురు క్రిటిక్స్ నొక్కి ఒక్కాణిస్తున్నారు.
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









