Chhaava Movie 5th day Box office Collecions: 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసిన ‘ఛావా’.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న వసూళ్లు..

Chhaava Movie 2nd day Box office Collecions: విక్కీ కౌశల్ హీరోగా నటించిన  రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ కుమారుడు ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘ఛావా’. ఈ మూవీ ఫస్ట్ డే విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక రెండో రోజు నుంచి ఈ సినిమా జోరు బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతూనే ఉంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 19, 2025, 12:19 PM IST
Chhaava Movie 5th day Box office Collecions: 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసిన ‘ఛావా’.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న వసూళ్లు..

Chhaava Movie 5th day Box office Collecions: ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథతో తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘ఛావా’. మొత్తంగా అందరు అనుకున్నట్టే దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఛావా’. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు అందరు అనుకున్నట్టే ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది. అంతేకాదు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో స్టార్ పవర్ అంతగా లేని విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  అతని గత చిత్రాలు ఏవి మొదటి రోజు డబుల్ డిజిట్ కూడా దాటలేదు. కానీ చారిత్రక యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి.  అది ఫస్ట్ డే  వసూళ్ల రూపంలో కనిపించింది. మొత్తంగా ఫస్ట్ డే  ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ.. రూ. 30 కోట్లకు పైగా నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ లో రాబట్టాయి. తాజాగా ఈ సినిమా రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.

Add Zee News as a Preferred Source

ఇక మూడో రోజు ఆదివారం దాదాపు రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. వర్కింగ్ డేస్ అయిన సోమవారంతో పాటు మంగళవారం మంచి హోల్డ్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా  ఐదు రోజుల్లో రాబట్టిన వసూళ్ల విషయానికొస్తే.. ఫస్ట్ డే రూ. 33.10 కోట్లు..రెండో రోజు రూ. 39.30 కోట్లు.. ఆదివారం.. రూ. 49.03 కోట్లు.. సోమవారం.. రూ. 24.10 కోట్లు.. మంగళవారం .. రూ. 25.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఈ రోజు మహారాష్ట్రలో శివాజీ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమా వసూళ్లు రూ. 30 కోట్ల నెట్ వసూళ్లను దాటినా.. ఆశ్యర్యపోవాల్సిన  పనిలేదు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

మొత్తంగా ‘ఛావా’ దూకుడు చూస్తుంటే.. రూ. 400 కోట్ల నెట్ వసూళ్ల నుంచి రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ లోని నటుడు కాకుండా.. ఆ పాత్రనే  కళ్ల ముందు కదలాడింది. ఓ రకంగా 2025 యేడాదికి గాను ఈ సినిమాలోని నటనకు జాతీయ అవార్డు ఇతనికే ఇవ్వాల్సిందే అని అపుడే చాలా మంది ప్రేక్షకులు సినిమా చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అటు యేసు పాత్రలో రష్మిక కూడా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా కలెక్షన్స్ తో పాటు రాబోయే అవార్డులల్లో సింహ భాగం ఈ సినిమాకు దక్కడం గ్యారంటీ అని చెప్పొచ్చు. ‘ఛావా’  సినిమాను కేవలం హిందీలోనే విడుదల చేశారు. మిగతా రీజనల్ లాంగ్వేజ్ అయిన తెలుగు, తమిళం,కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్  దక్కేవి.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News