Vishwambhara: VFX కాదంట.. మొత్తం AI... విశ్వంభర విమర్శలపై నిర్మాత..!

Vishwambhara teaser visuals: విశ్వంభర టీజర్ వచ్చిన దగ్గరనుంచి ఆ సినిమాపై అంచనాలు పెరగకపోగా.. విమర్శలు రావడం గమనర్హం. అందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో విజువల్స్ మరి దారుణంగా ఉన్నాయి అని సోషల్ మీడియాలో అందరూ ప్రచారం చేయడమే. అయితే అలాంటి విజువల్స్‌పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత.  

Written by - Vishnupriya | Last Updated : Apr 14, 2025, 11:44 AM IST
Vishwambhara: VFX కాదంట.. మొత్తం AI... విశ్వంభర విమర్శలపై నిర్మాత..!

Vishwambhara AI shots: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ సొషియో-ఫ్యాంటసీ చిత్రం 'విశ్వంభర' గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకి బింబిసారా అలాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Add Zee News as a Preferred Source

ఈ దర్శకుడు మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. ఈ డైరెక్టర్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు అనగానే అంచనాలు మరింత పెరిగాయి. అయితే టీజర్ చూశాక మాత్రం అందరి అంచనాలు కాస్త తారు మారు అయ్యాయి. అసలు ఈ సినిమా విజయం సాధిస్తుందని ఎంతోమందికి అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇక టీజర్‌లో కనిపించిన విజువల్స్‌పై ఎన్నో విమర్శలు వచ్చిన నేపథ్యంలో, ఈ విజువల్స్ వీఎఫ్‌ఎక్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించినవని..నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. 

కొన్నాళ్ల క్రితం విడుదలైన 'విశ్వంభర' టీజర్‌పై ప్రేక్షకుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. టీజర్‌లో కనిపించిన గ్రాఫిక్స్ నాణ్యతపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ విజువల్స్ వీఎఫ్‌ఎక్స్ కాకుండా ఏఐ టెక్నాలజీతో రూపొందించినవని నిర్మాత చెప్పారు.  

నిన్న మొన్నటి వరకు ఈ సినిమా విడుదల తేది ఆలస్యానికి కారణం కూడా విఎఫ్ఎక్స్  అని…టీజర్ దారినంగా రావడంతో సినిమా విఎఫ్ఎక్స్ మొత్తం మారుస్తున్నారు అనే మాటలు వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాత ఈ మాటలు చెప్పడం అందరిది షాప్ కి గురి చేస్తోంది.

అంతేకాకుండా వీఎఫ్‌ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో మారిన ప్లాన్.. వల్ల తాము తమ టీజర్ కోసం గ్రాఫిక్ కంపెనీలకు ఫుటేజ్ ఇచ్చామని.. అయితే చిత్ర బృందం వారికి ఆరు నెలల సమయం ఇచ్చినా కూడా వీఎఫ్‌ఎక్స్ పని పూర్తవ్వలేదని అన్నారు. దీంతో తాత్కాలికంగా టీజర్‌లో AI visuals వాడినట్టు వెల్లడించారు.

టీజర్‌పై విమర్శల నేపథ్యంలో, ఇకపై టోటల్‌గా వీఎఫ్‌ఎక్స్ పనితీరుతోనే ముందుకు వెళ్లాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందంట. అందుకే సినిమా విడుదలను వాయిదా వేసినట్టు నిర్మాత తెలిపారు. ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో ఒక ఊరట కనిపిస్తోంది.

ఈ చిత్రంలో చిరంజీవితో పాటు త్రిషా, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంస్థ UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి వ్యవహరిస్తున్నారు. మొదట సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించినా, వీఎఫ్‌ఎక్స్ పనుల ఆలస్యంతో కొత్త విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈసారి ఏఐ కాదు.. పూర్తి నాణ్యతతో కూడిన విజువల్స్‌తో సినిమాను అందించేందుకు యూనిట్ కృషి చేస్తోంది. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

Also Read: Telangana SC Reservation: నేటి నుంచి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ అమలు.. 30 ఏళ్ల పోరాటానికి ఫలితం..

Also Read: Telangana Rains: అకాల వర్షంతో అంతా ఆగమాగం.. తెలంగాణలో  2 రోజుల పాటు భారీ వర్షాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News