Chiranjeevi: ఒకరు కాదు.. ఇద్దరు.. చిరంజీవి సినిమా కోసం మల్టీ స్టారర్ రిపీట్ చేయనన్న అనిల్ రావిపూడి..!

Chiranjeevi Anil Movie Update: అనిల్ రావిపూరీకి ఇప్పటివరకు ఫ్లాప్స్ లేవు అన్న సంగతి తెలిసిందే. ఈయన తీసిన సినిమాల్లో ఎఫ్3 మాత్రమే యవరేజ్ గా నిలిచింది. మిగతా సినిమాలన్నీ కూడా దాదాపు మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో ఇప్పుడు తన తదుపరి సినిమాని చిరంజీవితో ప్రకటించారు ఈ డైరెక్టర్. 

Written by - Vishnupriya | Last Updated : Apr 2, 2025, 04:04 PM IST
Chiranjeevi: ఒకరు కాదు.. ఇద్దరు.. చిరంజీవి సినిమా కోసం మల్టీ స్టారర్ రిపీట్ చేయనన్న అనిల్ రావిపూడి..!

Chiranjeevi Anil Ravipudi Movie Update : చిరంజీవి కామెడీకి పెట్టింది పేరు. మరోపక్క అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే ముందుగా గుర్తొచ్చేది కామెడీ. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించగానే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 

Add Zee News as a Preferred Source

ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు సినిమా యూనిట్. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో వెంకటేశ్, రాఘవేంద్రరావు, నాగబాబు, అల్లు అరవింద్, దర్శకుడు బాబి, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు హాజరయ్యారు. అనిల్ రావిపూడి దాదాపు ప్రతి సంక్రాంతికి తన సినిమా ఉండేలా చూసుకుంటారు. ఇక ముంద సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఈ దర్శకుడు. ఈ క్రమంలో 2026 సంక్రాంతికి చిరంజీవితో తాను చేయబోయే సినిమాను విడుదల చేయబోతున్నట్టు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ చిత్రానికి #ChiruAnil అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. 

ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతుంది. అనిల్ రావిపూడి కి బ్లాక్ బస్టర్ అందించిన ఎఫ్2 సినిమా మల్టీస్టారర్ కాగా.. ఇప్పుడు చిరంజీవి చిత్రాన్ని కూడా మల్టీస్టారర్ గా తీయాలి అని ఈ దర్శకులు అనుకుంటున్నారు అనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో మరో హీరో ఫుల్ లెంగ్త్ లో కనిపించడంట. కేవలం కాసేపు మాత్రమే కనిపిస్తారు అని వినికిడి. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటి అంటే.. ఈ సినిమాలో కనిపించే మరో హీరో వెంకటేష్ అని కూడా వినిపిస్తోంది. 

అనిల్ రావిపూడి కి, వెంకటేష్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వెంకటేష్ కి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నిటికీ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం విశేషం. ఈ స్నేహబంధం తోనే వెంకటేష్ అనిల్ తదుపరి సినిమాలో కనిపించడానికి ఒప్పుకున్నారు అని.. తెలుస్తోంది. ఇక ఈ వార్తలు నిజమే అనిపించేలా పూజా కార్యక్రమాలకు కూడా వెంకటేష్ హాజరయ్యారు.

మరోవైపు ఈ ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ కు సంబంధించి ఒక వార్త సైతం చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యనే సిద్ధార్థ ని పెళ్లి చేసుకున్న ఆదితి రావు హైదరి.. ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది అని తెలుస్తుంది. మరోపక్క బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాను కూడా అనిల్ రావిపూడి సంప్రదించినట్టు చెబుతున్నారు. మరి ఈ వార్తలు అన్నిట్లో ఏది నిజమో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Also read: Heavy Rainfall Alert: ఎండల నుంచి ఊరట, ఏపీ, తెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News