Chiranjeevi - Anil Ravipudi: చిరంజీవి , అనిల్ రావిపూడి సినిమాకు అంతా సిద్ధం.. మరోసారి ఆ పాత్రలో మెగాస్టార్..

  Chiranjeevi - Anil Ravipudi: సీనియర్ హీరోల్లో  మెగాస్టార్ చిరంజీవి మంచి ఊపు మీదున్నారు. ఈ కోవలో వరుస చిత్రాలను చేస్తున్నారు. తాజాగా చిరంజీవి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన స్టోరీ నేరేషన్ పూర్తైయినట్టు దర్శకుడు ట్వీట్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 26, 2025, 07:37 PM IST
Chiranjeevi - Anil Ravipudi: చిరంజీవి , అనిల్ రావిపూడి సినిమాకు అంతా సిద్ధం.. మరోసారి ఆ పాత్రలో మెగాస్టార్..

Chiranjeevi - Anil Ravipudi: సెకండ్ ఇన్నింగ్స్ లో యంగ్ కథానాయకులకు  ధీటుగా వరుస చిత్రాలు చేస్తున్నారు చిరంజీవి. కొత్త కొత్త కథలతో పడుచు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్  చూపెడుతున్నారు. అయితే విశ్వంభర సినిమా తర్వాత వరుసగా చేయబోయే దర్శకులను లైన్ లో పెట్టుకున్నారు. ఈ కోవలో ముందుగా అనిల్ రావిపూడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి విషయానికొస్తే.. ఈ యేడాది వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 60 ప్లస్ ఏజ్ లో వెంకీ మామకు ఇండస్ట్రీ హిట్ అందించాడు. మరోవైపు తెలుగులో రాజమౌళి తర్వాత వరుస సక్సెస్ లు అందిస్తున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి మంచి దూకుడు మీదున్నాడు.

Add Zee News as a Preferred Source

మినిమం గ్యారంటీగా అనిల్ రావిపూడి సినిమాలుంటాయి. తాజాగా చిరంజీవితో చేయబోయే సినిమాకు సంబంధించిన కథతో పాటు నేరేషన్ పూర్తయినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో చిరంజీవి అసలు పేరైన శంకర్ వర ప్రసాద్ గా మెగాస్టార్ ను చూపించబోతున్నట్టు తెలిపాడు. ఓ రకంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహాలో మాస్ కామెడీ ఎంటర్టేనర్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. చిరంజీవి గారికి నా కథలో పాత్ర.. ‘శంకర్ వర ప్రసాద్’ ని పరిచయం చేశాను..ఇంకెందుకు లేటు..త్వరలో ముహూర్తంతో చిరు నవ్వుల పండగ బొమ్మకు శ్రీకారం అంటూ ట్వీట్ చేశారు.

ఈ సినిమాను చిరంజీవి కూతురు సుస్మితా తో పాటు సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఉగాది రోజున కొబ్బరికాయ కొట్టనున్నట్టు సమాచారం. అంతేకాదు వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్ తో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లేదు. ఈ యేడాది మంచి డేట్ చూసుకొని ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మరోవైపు శ్రీకాంత్ ఓదెల చిత్రం వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు వాల్తేరు వీరయ్య వంటి హిట్ ఇచ్చిన బాబీతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నారు. ఇక హరీష్ శంకర్, మారుతి లు కూడా చిరంజీవితో సినిమాలు చేయడానికి క్యూలో ఉన్నారు. మొత్తంగా  చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో ఎక్కడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News