Mega 154 Title Teaser First GLimpse : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దివాళి సందర్భంగా అక్టోబర్ 24న ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు టైటిల్ టీజర్ రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈక్రమంలో కాస్త ముందుగానే సెలెబ్రేషన్స్ మొదలుపెట్టేందుకు మేకర్లు చిన్న అప్డేట్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం రావాఈల్సిన టైటిల్ టీజర్ కంటే.. ముందే నేడు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అప్డేట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. టీజర్ డిజైన్, టైటిల్ అన్నీ కూడా అదిరిపోయాయి. చిరంజీవి స్టైల్, సిగరేట్ తాగే విధానం, ఆ పొగ అలా రావడం, డీఎస్పీ నేపథ్య సంగీతం అ్నీ అదిరిపోయాయి. ఇక ఈ ఫస్ట్ గ్లింప్సే ఈ రేంజ్‌లో ఉంటే.. రేపు రాబోతోన్న టైటిల్ టీజర్ ఇంకా పూనకాలు తెప్పించేలా ఉంటుందేమో.


 



అసలే మాస్ మూలవిరాట్, పూనకాలు లోడింగ్ అంటూ మొదటి నుంచి ఈ సినిమా మీద హైప్ పెంచేశారు. మాస్ మహారాజా రవితేజను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. చిరంజీవి, రవితేజ కలిసి మాస్ స్టెప్పులు వేయబోతోన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన సాంగ్ షూటింగ్ కూడా జరిగిందట.


ఈ మూవీని సంక్రాంతి బరిలోకి దించేందుకు మేకర్లు రెడీ అయ్యారు. జనవరి 11న ఈ చిత్రం బరిలోకి దిగనుంది. అయితే బాలయ్య రిలీజ్ చేసినట్టుగానే.. చిరంజీవి కూడా తన సినిమా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. మరి రేపు ఈ మూవీ అప్డేట్ మరింతగా ట్రెండ్ కానున్నట్టు కనిపిస్తోంది.


Also Read : NBK 107 Vs Chiru 154 : చిరుకి దరిదాపుల్లోకి రాలేని బాలయ్య.. మరీ అంత తక్కువా?.. దటీజ్ మెగాస్టార్


Also Read : Bigg Boss విన్నర్ ఎవరో తేలిపోయింది.. ఇంటి సభ్యులంతా కలిసి తీసుకున్న నిర్ణయం సరైనదేనా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook