Star Actress in Chiranjeevi Item Song : మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. నటిస్తున్న కొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'విశ్వంభర' తర్వాత చిరు మరోసారి తన ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా అభిమానులకి మంచి గుడ్ న్యూస్ ఏమిటంటే – ఈ సినిమాలో ఓ స్పెషల్ కిస్సిక్ సాంగ్ ప్లాన్ చేశారు..అది కూడా యంగ్ డాన్స్ సెన్సేషన్ శ్రీలీలతో కలిసి చిరంజీవి స్టెప్పులేయబోతున్నారన్న మాట ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
'పుష్ప 2' సినిమాలో తన డాన్స్‌తో ప్రేక్షకులని అలరించిన శ్రీలీల ఇప్పుడు చిరంజీవి లాంటి డ్యాన్సింగ్ లెజెండ్‌తో కలిసి.. ఓ ప్రత్యేక సాంగ్‌కి స్టెప్పులేయనుందని టాక్. దీనితో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. చిరు డాన్స్ అంటేనే అదొక ఫెస్టివల్. అలాంటి డ్యాన్స్ మాస్టర్‌తో శ్రీలీల జతకడతే ఆ పాట థియేటర్లలో ఓ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోవడం ఖాయం.
ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్స్ Ceciroleo ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఫోక్ సాంగ్స్‌తో హిట్‌ల హవా చూపిస్తున్న ఆయన, ఈ సినిమా కోసం ఓ మాస్ బీట్‌ను సిద్ధం చేస్తున్నారట. ఆ మాస్ బీట్‌పై చిరు ఎనర్జిటిక్ డ్యాన్స్, శ్రీలీల స్టైలిష్ మూవ్స్ కలిస్తే ఇంకేముంటుంది – తెరపై మరో సెన్సేషన్ ఖాయం.
ఈ సినిమా ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. చిరంజీవి కూతురు సుష్మిత ఈ సినిమాలో సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి 2026 విడుదలకు ప్లాన్ చేస్తుండగా, ఈ స్పెషల్ సాంగ్ అప్‌డేట్ త్వరలోనే అధికారికంగా వెలువడనుంది.
ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండగా, చిరు-శ్రీలీల డ్యాన్స్ వీడియో థియేటర్‌ల్లో పండగలా మారనుంది!
మరోపక్క.. చిరంజీవి విశ్వంభర చిత్రం.. ఆలస్యం అవుతూనే వస్తోంది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా.. సినిమా VFX పైన.. టీజర్ విరుదల తర్వాత.. ఎన్నో విమర్శలు రావడం వల్ల.. ఈ చిత్రం VFX మొత్తం మళ్ళీ రీ చేస్తున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ఇవన్నీ ముగించుకొని ఎప్పటికీ విడుదల అవుతుందో వేచి చూడాలి.
Also Read: కొత్త మంత్రుల పేర్లు అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్.. వారికి నిరాశే!
Also Read: పక్కా హైదరాబాదీ మాగంటి గోపీనాథ్ సినీ, రాజకీయ నేపథ్యం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









