Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. ఏకంగా బ్రిటన్ పార్లమెంట్ లో మెగాస్టార్ కు సన్మానం..

Chiranjeevi UK Parliament: తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ కథానాయకుడు పద్మవిభూషణ్.. డాక్టర్ చిరంజీవి కి అరుదైన గౌరవం దగ్గబోతుంది. త్వరలో యునైటైడ్ కింగ్ డమ్ కు చెందిన పార్లమెంట్ లో ని హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయన్ని ఘనంగా సన్మానించనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 14, 2025, 10:57 AM IST
Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. ఏకంగా బ్రిటన్ పార్లమెంట్ లో మెగాస్టార్ కు సన్మానం..

Chiranjeevi UK Parliament:  తెలుగు సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా మూడు దశాబ్దాలుగా ఏలిన మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దగ్గబోతుంది. హౌస్ ఆఫ్ కామ‌న్స్ - యు.కె పార్ల‌మెంట్ లో ఆయన్ని గౌరవించనున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యుకె కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న అక్కడి పార్లమెంట్ సభ్యుల సమక్షంలో స‌న్మానించ‌నున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Add Zee News as a Preferred Source

అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ,  సినిమా , ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ మెగాస్టార్ కు ప్రదానం చేయనున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉద్దేశంతో  వారిని సత్కరిస్తూ ఉంటుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అంద‌జేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోబోతున్నారు. ఆయన ఆయ‌న కీర్తి కీర‌టంలో మ‌రో క‌లికితురాయిగా నిలుస్తుంది.గతంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ తో పాటు పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. అంతేకాదు ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా. అటు ఎక్కువ పాటల్లో డాన్స్ చేసిన నటుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు 2024లో అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా అందుకోవడం విశేషం.

యు.కె కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీ  సన్మానించనుండంతో మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ ఇవ్వ‌టం అనేది ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News