Chiranjeevi: లండన్ లో చిరంజీవిపై అభిమానుల పూల వర్షం..

Chiranjeevi In Londaon: టాలీవుడ్ సీనియర హీరో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి తాజాగా గ్రేట్ బ్రిటన్ రాజధాని లండన్ వెళ్లారు. అక్కడ చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2025, 10:04 AM IST
Chiranjeevi: లండన్ లో చిరంజీవిపై అభిమానుల పూల వర్షం..

Chiranjeevi In Londaon:  మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలతో పాటు సామాజికంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటివి నిర్వహిస్తూ వస్తున్నారు. తనకు ఎంతో ఇచ్చి సమాజానికి ఎంతో కొంత ఇచ్చి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో అభిమానుల సహకారంతో బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారికి సహాయ పడుతున్నారు. కేవలం రాజకీయాల ద్వారానే కాకుండా సినిమా రంగం ద్వారా వచ్చిన పలుకుబడితో ఈ సేవలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 19న బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు హౌస్ ఆఫ్ కామన్స్ సభలో  చిరంజీవిని ఘనంగా సత్కరించనున్నారు.

Add Zee News as a Preferred Source

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 30 యేళ్లుగా నెంబర్ హీరోగా సత్తా చాటారు చిరంజీవి. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యునైటైడ్ కింగ్ డమ్ కు చెందిన  అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న (రేపు) అక్కడి పార్లమెంట్ మెంబర్స్ సమక్షంలో స‌న్మానించ‌నున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ ప్రోగ్రామ్ కు అటెంట్ కానున్నారు. ఈ సత్కారం కోసం లండన్ చేరుకున్న చిరంజీవికి అక్కడ ప్రవాస తెలుగు వాళ్లు పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. తనపై విదేశాల్లో అభిమానులు చూపిస్తోన్న ఈ ప్రేమకు చిరంజీవి పులకరించిపోయారు.

అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, మూవీస్, సోషల్ సర్వీస్.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ చిరంజీవికి ప్రదానం చేయనున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది బ్రిటన్ లో  ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే దేశ, విదేశాల్లో  వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉద్దేశంతో  వారిని గౌరవిస్తూ  ఉంటుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును రేపు  చిరంజీవి అందుకోబోతున్నారు. ఆయన ఆయ‌న కీర్తి కీర‌టంలో మ‌రో క‌లికితురాయిగా నిలవబతుంది.

గతంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ తో పాటు పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవించింది.  అంతేకాదు ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. అటు ప్రపంచంలో  ఎక్కువ పాటల్లో డాన్స్ చేసిన నటుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవి పేరును చేర్చారు. అంతేకాదు 2024లో అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో  యు.కె కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ ఇంటర్నేషనల్ డయాస్ పై  చిరంజీవిని  సన్మానించనుండంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ ఇవ్వ‌టం అనేది ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం. ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నెక్ట్ ప్రాజెక్ట్ వచ్చే యేడాది పట్టాలెక్కనుంది.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News