Chiranjeevi Receivs UK Parliment Award: టాలీవుడ్ సీనియర అగ్ర కథానాయకుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి ఖాతాలో మరో మణిహారం చేసింది. తాజాగా ఈయన్ని యూకే (యునైడైడ్ కింగ్ డమ్)కు చెందిన పార్లమెంట్ కు చెందిన హౌస్ ఆఫ్ కామన్స్ సమలో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ అవార్డు అందుకోవడం కోసం చిరంజీవి గ్రేట్ బ్రిటన్ రాజధాని లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అక్కడ బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును ను అక్కడ పార్లమెంట్ సభ్యుల సమక్షంలో బ్రిటన్ ఎంపీ నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో అందజేశారు.
చిరంజీవి విషయానికొస్తే.. కేవలం సినిమాలు, రాజకీయాలు కాకుండా.. బ్లడ్, ఐ బ్యాంక్ ద్వారా సామాన్య ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. తనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఈ సామాజిక కార్యక్రమాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 45 యేళ్లుగా హీరోగా అలరిస్తూనే ఉన్నారు. మధ్యలో రాజకీయాల్లో వెళ్లారు. ఎమ్మెల్యేగా.. రాజ్యసభ సభ్యుడిగా.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి హీరోగా దుమ్ము దులుపుతున్నారు. ఇక లండన్ వెళ్లిన చిరంజీవికి అక్కడ ప్రవాస తెలుగు వాళ్లు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది బ్రిటన్ లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపకల్పనలో పనిచేస్తుంది. అలాగే దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లోని పర్సన్స్ సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని గౌరవిస్తూ ఉంటుంది.
గతంలో చిరంజీవి చేసిన సేవలకు గుర్తించి అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పాటు తాజాగా ఎన్డీయే సర్కారు పద్మభూషణ్ తో పాటు పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. అటు వరల్డ్ తో ఎక్కు సాంగ్స్ లో నృత్యాలు చేసిన నటుడిగా చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కింది.గతేడాది అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యు.కె కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ ఇంటర్నేషనల్ డయాస్ పై చిరంజీవిని సన్మానించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయిందనే చెప్పాలి.ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రాన్ని చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నెక్ట్స్ మూవీకి ప్రిపేర్ అవుతున్నారు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నెక్ట్ ప్రాజెక్ట్ నెక్ట్స్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.