HBD Ram Charan: చిరు తనయుడిగా ఎంట్రీ.. కట్ చేస్తే మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ ప్రస్థానం..

HBD Ram Charan: రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడి గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తొలి చిత్రంతోనే యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక రెండో సినిమా ‘మగధీర’తో టాలీవుడ్ రికార్డుల బెండు తీసాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా తన సత్తా ఏంటో చూపించాడు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 26, 2025, 01:57 PM IST
HBD Ram Charan: చిరు తనయుడిగా ఎంట్రీ.. కట్ చేస్తే మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ ప్రస్థానం..

HBD Ram Charan: రామ్  చరణ్..  చిరంజీవి నట వారసుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అంతేకాదు తొలి సినిమాే చిరు తనయుడు అనే అర్ధం వచ్చేలా ‘చిరుత’ పేరుతో  తెరంగేట్రం చేసి తండ్రి రూట్లోనే మెగాధీరగా  నిలిచాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన  రెండో సినిమా ‘మగధీర’తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసాడు.  రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కథానాయకుడిగా  రామ్ చరణ్‌ను స్టార్‌ హీరోగా ఎస్టాబ్లిష్ చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత మూడో చిత్రంగా  ‘ఆరెంజ్’  అంటూ లవబుల్ సినిమా చేసాడు. ఈ మూవీ అడ్వాన్స్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది.   రామ్ చరణ్ .. ఆ తర్వాత రచ్చ, నాయక్ వంటి మాస్ చిత్రాలతో తెలుగులో యాక్షన్ కథానాయకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కథానాయకడిగా సక్సెస్‌లు అందుకున్నా.. నటుడిగా రామ్ చరణ్‌కు పెద్దగా పేరైతే రాలేదు. కెరీర్  తొలి నాళ్లలో తండ్రి బాటలో డాన్స్, ఫైట్స్ విషయంలో ఈజ్ చూపించినా.. నటనలో తేలిపోయాడనే కామెంట్స్ వినిపడ్డాయి. ముఖంలో సరైన ఎక్స్ ప్రెషెన్ పలికించలేడనే హీరోగా బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలో  పేరు వచ్చింది. అప్పట్లో క్రిటిక్స్ కూడా రామ్ చరణ్ ను ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఏకిపారేసారు.  

Add Zee News as a Preferred Source

అంతకు ముందు కొన్ని సినిమాల్లో  రామ్ చరణ్ నటించినా..  అందులో పెద్దగా యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ ఉండేది కాదు.  నాలుగు డాన్సు స్టెప్పులు.. మూడు ఫైట్స్ అంటూ ఓ ఫార్ములా ప్రకారం సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు రామ్ చరణ్.  ఇలాంటి సమయంలో   వాటికి చెక్ చెబుతూ సుకుమార్  డైరెక్షన్ లో  రామ్ చరణ్ చేసిన 'రంగస్థలం' చిత్రం రామ్ చరణ్ లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అని పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కెరీర్ ‘రంగస్థలం’ ముందు రంగస్థలం తర్వాత అనే రేంజ్ కు వెళ్లిపోయింది. ఈ సినిమాలో తన నటనతో తిట్టిన నోళ్లతోనే ప్రశంసలు అందుకునేలా చేసుకున్నాడు. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది.

‘రంగస్థలం’ వంటి గ్రామీణ నేపథ్య సినిమా తర్వాత  బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'వినయ విధేయ రామ' చిత్రంతో  నటుడిగా పలు విమర్శలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయిన తీరును అందరు మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో న  తోటి స్టార్ అయిన ఎన్టీఆర్‌తో పోటీ పడ నటించాడు.  ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ సక్సెస్ తర్వతా తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి యాక్ట్ చేసిన 'ఆచార్య'చిత్రంతో భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఈ చిత్రం మన తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. అంతకు ముందు రామ్ చరణ్ నటించిన ‘మగధీర’,‘బ్రూస్లీ’ సినిమాల్లో చిరంజీవి అతిథి పాత్రల్లో మెప్పిస్తే..  రామ్ చరణ్ తండ్రి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ లో ఓ పాటలో గెస్ట్ గా మెరిసాడు.

ఇక ఈ యేడాది ఎన్నో అంచనాల మధ్య శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో 16వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. రామ్ చరణ్ సోషల్ మీడియా మాధ్యమం Xలో దాదాపు 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అటు మరో సామాజిక మాధ్యమం  ఇన్‌స్టాగ్రామ్‌లో 26 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.  

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News