Chiranjeevi:చిరంజీవి..పాలిటిక్స్ లో వెళ్లిన తర్వాత మళ్లీ 'ఖైదీ నంబర్ 150'సినిమాతో కథానాయకుడిగా రీ ఎంట్రీ ఇచ్చి హీరోగా తన స్టామినా చెక్కు చెదరలేదని ప్రూవ్ చేసుకున్నారు.ఈ చిత్రాన్ని చిరంజీవి.. తన ఇంటి పేరైన కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్‌లో కుమారుడు రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా చేసాడు. ఈ మూవీ విడుదల తర్వాత మళ్లీ.. అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ లో మరో సినిమా చేయనే లేదుచిరంజీవితో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా ఈ బ్యానర్ లో సినిమాలు చేయలేదు. .
చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా తన ఓన్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ నిర్మాతగా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. కానీ తన సొంత బామ్మర్ధి అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌లో ఒక్క సినిమాకు సై అనలేదు ఈ సైరా నరసింహా రెడ్డి. వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నా.. సినిమాల పరంగా ఎవరికీ వారే అన్నట్టుగా ఉంటున్నారు. ఏది పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం కత్తులు దూసుకుంటునే ఉన్నట్టు వారి సన్నిహితులు చెబుతున్న మాట. ప్రజా రాజ్యం పార్టీ నిండా మునగడంతో పాటు చిరంజీవి రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ కావడంతో అల్లు అరవింద్ పాత్ర ఉందనేది మెగా కాంపౌండ్ చెబుతున్న మాట. అందుకే రీ ఎంట్రీ తర్వాత సొంత బామ్మర్ధిని దూరం పెడుతూనే ఉన్నారు. అందుకే చిరుతో పాటు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కూడా ఆ బ్యానర్ లో సినిమాలు చేయలేదు. లాస్ట్ ఇయర్ ‘పుష్ప 2’ మూవీ విడుదల సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయినా.. మెగా ఫ్యామిలీలో చిరు తప్పి మిగతా హీరోలు పెద్దగా స్పందించలేదు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
గతంలో చిరంజీవికి తన తమ్ముడు నాగబాబుతో తల్లి పేరుతో అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి అందులో వరుసగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే కదా. అందులో 'బావగారూ బాగున్నారా.. మాత్రమే హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మరే సినిమా ఆ బ్యానర్‌లో సక్సెస్ కాలేదు. ఇక నాగబాబు నిర్మాతగా మారిన సినిమాల ప్రొడక్షన్ బాధ్యతలను కూడా అల్లు అరవింద్ చూసుకునేవారు.
ఇక అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను చిరంజీవిని ప్రత్యేకంగా చూడలేము. ఒక రకంగా మెగాస్టార్‌కు ఇది మరో సొంత బ్యానర్ అనే చెప్పాలి. ఇందులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు చిరు. అందులో పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలున్నాయి. చివరగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చిరంజీవి .. అందరివాడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత రాజకీయాల్లో వెళ్లి బిజీ అయిపోవడం.. ఆ తర్వాత తనే కుమారుడు రామ్ చరణ్ చేత కొణిదెల ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయించి వరుసగా చిత్రాలు చేస్తున్నారు. అటు వేరే బ్యానర్‌లో కూడా మూవీలు చేస్తున్నా.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌లో మాత్రం ఏ మూవీ చేయలేదు. త్వరలో చేస్తారన్న గ్యారంటీ లేదు.
మరోవైపు అల్లు అరవింద్.. చిరు ప్రత్యర్ధి హీరో అయిన బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ షో చేస్తున్నారు. దాంతో పాటు బాలయ్యతో నిర్మాతగా ఓ సినిమా నిర్మించబోతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి.. తన ఓన్ బ్యానర్ అయినటు వంటి గీతా ఆర్ట్స్‌లో నెక్ట్స్ సినిమా చేస్తే చూడాలనుకునే ఫ్యాన్స్ ఉన్నారు. మరోవైపు అల్లు అరవింద్ కూడా చిరుతో సినిమా అంటే ఈజీ వ్యవహారం కాదు. మంచి కథ, కథనంతో పాటు దర్శకుడు సెట్ అయితే కానీ వీళ్ల కాంబోలో సినిమా పట్టాలెక్కిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ జరిగే పని కాదు. ఇక అల్లు అరవింద్ కు మంచి స్టోరీ దొరికితే.. తన తనయుడు అల్లు అర్జున్‌తో చేస్తాడు కానీ.. చిరుతో ఎందుకు చేస్తాడనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. అటు అనిల్ రావిపూడి, బాబీలతో నెక్ట్స్ సినిమాలు చేయబోతున్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









