Chiranjeevi: బాలయ్య కాంపౌండ్.. మెగా కాంపౌండ్.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Chiranjeevi at Laila Event: విశ్వక్సేన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వెళ్లడంతో పలు ట్రోల్స్ వైరల్ కాగా, ఇండస్ట్రీ అంతా ఒక్కటే అంటూ చిరంజీవి తెలిపారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ లో మెగా కాంపౌండ్…బాలయ్య కాంపౌండ్ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..పూర్తి వివరాల్లోకి వెళితే. 

Written by - Vishnupriya | Last Updated : Feb 10, 2025, 11:23 AM IST
Chiranjeevi: బాలయ్య కాంపౌండ్.. మెగా కాంపౌండ్.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Mega Compound and Balakrishna Compound: టాలీవుడ్లో యంగ్ హీరోలలో మాస్ కా దాస్ గా పేరుపొందిన  విశ్వక్ సేన్.. తాజాగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం లైలా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రామ్ నారాయణ్ (Ram Narayan) తెరకెక్కిస్తూ ఉండగా హీరోయిన్గా ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) నటిస్తూ ఉన్నది. లైలా చిత్రంలో లేడీ గెటప్ కూడా వేశారు విశ్వక్ సేన్ .. ఎక్కువగా విశ్వక్ బాలకృష్ణ (Balakrishna) తో కనిపిస్తూ ఉండడంతో.. ఎక్కువ మంది బాలయ్య కాంపౌండ్ లోనే విశ్వక్ సేన్ ఉన్నారంటూ వార్తలు వైరల్ చేశారు.  

Add Zee News as a Preferred Source

అంతేకాకుండా ఎక్కడ ఫంక్షన్ జరిగినా సరే అక్కడ బాలయ్య తో పాటు కనిపిస్తూ ఉండేవారు. తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని కూడా ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. నందమూరి కుటుంబం నుంచి సినిమా విడుదలవుతుందంటే చాలు ఇక రచ్చ చేస్తూ ఉంటారు విశ్వక్.

కానీ లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ ని గెస్ట్ గా పిలిచారు. దీంతో అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా చాలామంది నందమూరి నుంచి మెగా కాంపౌండ్ కి విశ్వక్ షిఫ్ట్ అయ్యారు అనే విధంగా చాలామంది ట్రోల్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటీనటులకు సంబంధించి వారి యొక్క అభిమానులకు సంబంధించి పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

 తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలోనైనా సరే హీరోలు అందరూ కూడా ఒక్కటిగానే ఉంటారు.  వారి అభిమానులు మాత్రం ఒకరి పైన ఒకరు ద్వేషం పెంచుకుంటూ ఉంటారని తెలిపారు. విశ్వక్సేన్ ఫంక్షన్ కి వస్తున్నప్పుడు నువ్వు వెళ్తున్నావా అని చాలామంది అడిగారు. అయితే అతను మన మనిషి కాదు బాలకృష్ణ కాంపౌండ్ అంటూ చాలామంది అంటూ ఉన్నారు. అలాంటి వారందరికీ నేను ఒకటే చెబుతున్నాను.. సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కటే కాంపౌండ్ అంటూ తెలిపారు.

 మనిషి అన్నాక వేరే వారి మీద ప్రేమ ఆప్యాయత ఉండడం సాధారణమే కదా.. అంతెందుకు తమ కుమారుడు రామ్ చరణ్ కు సూర్య అంటే చాలా ఇష్టము. నేను  రామ్ చరణ్ ఫాన్స్ కోసం వెళ్లడం  లేదా అంటూ తెలిపారు. మొత్తానికి ఇండస్ట్రీ అంతా ఒక్కటే అన్నట్లుగా తెలిపారు చిరంజీవి.

Read more: Viral Video: పెళ్లిలో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తు స్టేజీ మీదనే కుప్పకూలీన యువతి.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News