Ramam Movie: రామం.. ది రైజ్ ఆఫ్ అకిరా.. పవర్‌ఫుల్‌గా మోషన్ పోస్టర్

Ramam Movie Poster: భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవల్లో రామం అనే మూవీ ప్రకటించారు ప్రముఖ నిర్మాత స్టూడియోస్  వేణు దోనేపూడి. ఇప్పటివరకు రానటువంటి ఓ యోధుడి కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 6, 2025, 08:26 PM IST
Ramam Movie: రామం.. ది రైజ్ ఆఫ్ అకిరా.. పవర్‌ఫుల్‌గా మోషన్ పోస్టర్

Ramam Movie Poster: శ్రీరామ నవమి సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్  వేణు దోనేపూడి పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో రామం అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో యాక్ట్ చేస్తున్నాడు. ఆదివారం రామం మూవీకి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధర్మ సంస్థాపనకు యుద్ధం చేసిన ఆ శ్రీరాముడి అడుగు జాడల్లో నడుస్తూ.. రఘునందుడి బాట అందరికీ ఆదర్శం అని చాటే చెప్పే ఓ వీరుడికి కథను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు  రానటువంటి  ఓ గొప్ప యోధుడి కథాంశంతో రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ సినిమాతో లోక‌మాన్య‌ను దర్శకుడిగా వేణు దోనేపూడి పరిచయం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌, అంత‌ర్జాతీయ విలువ‌ల‌తో పాన్ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. సమస్త మానవాళికి తారక మంత్రం శ్రీరామనామం అని అన్నారు. ధర్మ సంస్థాపనకు శ్రీరామచంద్రుడు చూపిన బాటే కాదు.. అధర్మం నిర్మూలించటానికి ఆయన కోదండం చేపట్టి చూపిన వీరత్వం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుందని చెప్పుకొచ్చారు.

అలాంటి గొప్ప సమగ్ర మూర్తిమత్వాన్ని ఆధారంగా చేసుకుని రామం మూవీని రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుత కాలానికి అలనాటి రామరాజ్యాన్ని కనెక్ట్ చేస్తూ.. ఇప్పటివరకు రానటువంటి డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెడతామన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. అత్యుత్తమ ప్రమాణాలతో.. ఇంటర్నేషన్ టెక్నికల్ వ్యాల్యూస్‌తో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నామన్నారు. టాలీవుడ్‌కు చెందిన ఓ రైజింగ్ స్టార్ హీరోగా నటిస్తున్నారని.. దేశ వ్యాప్తంగా అగ్ర నటీనటులు, టెక్నికల్ టీమ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

Also Read: Kancha Gachibowli: హెచ్‌సీయూ, కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్‌ సంచలన లేఖ

Also Read: Golden Cave: బంగారు నిధితో నిండిన గుహ.. ఆ ద్వారం తెరిస్తే ఇండియా ఫుల్‌ రిచ్ అవుతుంది..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News