Constable:‘కానిస్టేబుల్’మూవీలో ‘మేఘం కురిసింది’ పాటను విడుదల చేసిన మాజీ మంత్రి తలసాని..

Constable: వరుణ సందేశ్ కథానాయకుడిగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం ‘కానిస్టేబుల్’.  జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై  బలగం జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి టాలీవుడ్ చిత్ర  పరిశ్రమకు పరిచయం అవుతోంది. తాజాగా ఈ సినిమాలోని ‘మేఘం కురిసింది’  పాటను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 13, 2025, 07:59 PM IST
Constable:‘కానిస్టేబుల్’మూవీలో  ‘మేఘం కురిసింది’ పాటను విడుదల చేసిన మాజీ మంత్రి తలసాని..

Constable: చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని  తెలంగాణ మాజీ  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి లోని తన ఆఫీసులో  జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, మధులిక జంటగా ఆర్యన్ సుభాన్ డైరెక్షన్ లో  బలగం  జగదీష్ నిర్మించిన "కానిస్టేబుల్త్" చిత్రంలోని ‘మేఘం కురిసింది... ’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.

Add Zee News as a Preferred Source

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.  పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, ఫ్యామిలీ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో  నిర్మించిన  ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించే ఫ్యాన్  ఇండియా చిత్రాలలో కొన్ని మాత్రమే నడస్తున్నాయి. సినీ పరిశ్రమలో తాము కూడా రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారన్నారు. వారిని ప్రోత్సహించాలని అన్నారు. సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు.  

దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్ గా మారిందని చెప్పుకొచ్చారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు ఈ  పాట విడుదల సందర్భంగా సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, చిత్ర హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీష్, BRS నాయకులు జగ్గయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News