Notices To Heroes: వివాదంలో కుంకుమపువ్వు పాన్‌ మసాలా యాడ్‌.. షారూక్, టైగర్, అజయ్ దేవగణ్‌కు భారీ షాక్‌!

Misleading Pan Masala Ad Notice Issued To SRK Ajay Devgn And Tiger Shroff: నిషేధిత.. అనారోగ్యం కలిగించే పాన్‌ మసాలాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న బాలీవుడ్‌ అగ్ర హీరోలకు భారీ షాక్‌ తగిలింది. తమ ముందు హాజరుకావాలని.. ఎలాంటి మినహాయింపు లేదని ఓ కోర్టు హెచ్చరించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 8, 2025, 03:25 PM IST
Notices To Heroes: వివాదంలో కుంకుమపువ్వు పాన్‌ మసాలా యాడ్‌.. షారూక్, టైగర్, అజయ్ దేవగణ్‌కు భారీ షాక్‌!

Pan Masala Advertisement: క్యాన్సర్‌ వంటి కారకాలకు దారి తీస్తుందని ఎంత హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. వారికి అవగాహన కల్పించాల్సిన సినీ నటులు ప్రోత్సహిస్తూ ప్రచారం కల్పిస్తుండడంతో దేశంలో యథేచ్ఛగా పాన్‌ గుట్కా మసాలా వినియోగం పెరుగుతోంది. దీని కారణంగా వేలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇది గమనించి ఓ పౌరుడు సినీ నటులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్‌ వేశాడు. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం స్టార్‌ నటులకు భారీ షాక్‌ ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Add Zee News as a Preferred Source

Also Read: Groom Suicide: పసుపు తాడు కట్టాల్సినోడు ఉరితాడు బిగించుకున్నాడు.. షాక్‌లో వధువు

ఓ పాన్‌ మసాలా కంపెనీకి బాలీవుడ్‌ అగ్ర నటులు షారూక్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆ పాన్‌ మసాలా ఉత్పత్తులకు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్‌ ఆ ముగ్గురు నటులు చేస్తున్నారు. అయితే ఆరోగ్యానికి హానికరమైన ఆ పాన్‌ మసాలా ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దానికి మద్దతుగా ప్రచారం కల్పిస్తున్న హీరోల ధోరణిని కొందరు తప్పుబడుతున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సామాన్యుడు యోగేంద్ర సింగ్‌ బడియాల్‌ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

Also Read: Water Bottle Fine: వాటర్‌ బాటిల్‌కు ఎక్స్‌ట్రా రూ.27 తీసుకున్నందుకు రూ.27 లక్షల భారీ జరిమానా

అతడి ఫిర్యాదును స్వీకరించిన ఫోరం విచారణ చేపట్టింది. గుట్కా ఉత్పత్తుల ప్రచారంలో కుంకుమపువ్వు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారని.. ఒక కిలో కుంకుమ పువ్వు ధర దాదాపు రూ.4 లక్షల దాకా ఉంటుండగా.. అలాంటిది రూ.5కు లభించే గుట్కాలో ఎలా ఇస్తున్నారని యోగేంద్ర సింగ్‌ ఫిర్యాదులో ప్రశ్నించాడు. గుట్కాలో కుంకుమపువ్వు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. పొగాకు ఉత్పత్తుల కారణంగా చాలా మంది క్యాన్సర్‌ బారినపడుతున్నారని.. వీటిని భారతదేశంలో నిషేధించాలని యోగేంద్ర ఫిర్యాదులో వినియోగదారుల ఫోరాన్ని కోరాడు.

విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం చైర్మన్‌ గైర్సిలాల్‌ మీనా, సభ్యురాలు హేమలత అగర్వాల్‌ పాన్‌ మసాలా ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న హీరోలకు నోటీసులు జారీ చేశారు. మార్చి 19వ తేదీన జరిగే కోర్టు విచారణకు హాజరుకావాలని షారూక్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, టైగర్‌ ష్రాఫ్‌లకు జైపూర్‌ జిల్లా పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే కఠిన చర్యలు తప్పవని నోటీసుల్లో కోర్టు హెచ్చరించింది. ఈ పరిణామం బాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. అంతేకాకుండా గుట్కా మసాలా తయారీ కంపెనీ యాజమాన్యానికి కూడా కోర్టు నోటీసులు పంపించింది. గతంలో కూడా సినీ నటీనటులకు పలు ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న సమయంలో ఎదురైంది. మరి కోర్టు నోటీసులకు హీరోలు స్పందిస్తారో లేదో చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News