Sivaji: ‘కోర్ట్’ మూవీతో మారిపోయిన శివాజీ జాతకం.. మంగపతిగా నట విశ్వరూపం..

Sivaji: నటుడు శివాజీ గురించి చెప్పాలంటే.. హీరో కంటే సైడ్ హీరోగానే ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ మధ్య బిగ్ బాస్ తెలుగులో సందడి చేసారు. మధ్యలో నటనకు దూరమైన ఇతను.. తాజాగా ‘కోర్ట్’ మూవీలో మంగపతిగా తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా నుంచి తనను అందరు మంగపతిగా పిలవడం ప్రారంభిస్తారని చెప్పుకొచ్చాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 14, 2025, 12:08 PM IST
Sivaji: ‘కోర్ట్’ మూవీతో మారిపోయిన శివాజీ జాతకం.. మంగపతిగా  నట విశ్వరూపం..

Sivaji: హీరో శొంఠినేని శివాజీ గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఓవైపు హీరోగా నటిస్తూనే.. సైడ్ హీరోగా నటించడం ఈయన ప్రత్యేకత.  తెలుగులో అనేక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో  లో ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వ్యక్తిత్వం చూసి అనేకమంది ఈ జనరేషన్ కిడ్స్ కూడా ఆయనకు ఫ్యాన్స్ గా  మారిపోయారు.

Add Zee News as a Preferred Source

ఇక ఆ తర్వాత #90స్ అనే వెబ్ సిరీస్ తో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన తెరపై  చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి శివాజీ తాజాగా నాని నిర్మాతగా రామ్ జగదీష్ అనే కొత్త కుర్రాడి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కోర్ట్’  సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మంగపతి  పాత్రలో నటించారు. అలా అనేకంటే కంటే జీవించాడు అని చెప్పవచ్చు. స్క్రీన్ మీద శివాజీ కనపడిన ప్రతిసారి ఆయన యాక్టింగ్.. ఆయన డైలాగ్ డెలివరీకి అభిమానులు ఫిదా అయిపోతున్నారనే చెప్పాలి.

శివాజీలో ఇంత మంచి నటుడు ఉన్నాడా అని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.  అంతేకాక ఒక్కోసారి శివాజీ నటన చూసి చప్పట్లు చరుస్తూ అభినందిస్తున్నారు. ఈ సినిమాలో మంగపతి పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. మనం రియాలిటీలో చూసిన కొన్ని పాత్రలకు ఆపాదించుకునేలా ఆ పాత్ర ఉండటంతో చాలా మంది శివాజీ పాత్రకు కనెక్ట్ అయిపోతున్నారు. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు విశ్లేషకులు సైతం తమ రివ్యూస్ లో శివాజీ నటన గురించి ప్రస్తావిస్తున్నారు. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడం అందరూ చేస్తూనే ఉంటారు.  కానీ ఇలాంటి ఒక సాలిడ్ పాత్రతో రీఎంట్రీ ఇవ్వడం శివాజీకే చెల్లిందేమో. ఇక ఈ పాత్ర దెబ్బతో శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లో మరిన్ని పాత్రలు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News