Court Review: సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టే ‘కోర్ట్’ మూవీ..

Court Movie Review: తెలుగు సినీ పరిశ్రమ సహా అన్ని ఇండస్ట్రీస్ లో కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలనే అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో కోర్ట్ డ్రామా మూవీ ‘కోర్ట్’. ఈ నెల 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..! 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 13, 2025, 01:19 PM IST
Court Review: సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టే ‘కోర్ట్’ మూవీ..

గత కొన్నేళ్లుగా తెలుగులో కోర్టు డ్రామా నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఒకప్పటి సుడిగుండాలు, అభిలాష, ధర్మక్షేత్రం, ధర్మచక్రం ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో కోర్టు డ్రామా నేపథ్యంలో వచ్చిన చాలా చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ  కోవలో దర్శకుడు రామ్ జగదీశ్ ‘కోర్ట్’  టైటిల్ తోనే సినిమాను తెరకెక్కించాడు. సినిమా కథపై దర్శక, నిర్మాతలకు ఉన్న కాన్ఫిడెన్స్ మూలంగా విడుదలకు రెండు రోజులు ముందే ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీంతో కథపై నానికున్న పట్టు ఎలాంటిదో ఈ సినిమా కథ చూస్తే తెలుస్తోంది.
ఒక సినిమా కథను జడ్జ్ చేయడం ఒక ఎత్తు. దాన్ని అనుకున్నది అనుకున్నట్టు తెరపై చూపించడం మరో ఎత్తు. అందులో దర్శకుడు రామ్ జగదీశ్ సక్సెస్ అయ్యాడు.  

Add Zee News as a Preferred Source

సినిమా స్టోరీ విషయానికొస్తే..
చంద్ర శేఖర్ అలియాస్ చందు ఇంటర్మీడియట్  ఫెయిలై పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ ఫైనాన్స్‌లో బైక్ కూడా తీసుకుంటాడు. అలాంటి చందు లైఫ్‌లోకి జాబిల్లి వస్తుంది. ఫోన్ కాల్స్ ద్వారా మొదలైన వీరి పరిచయం చివరకు లవ్ గా మారుతుంది. ఈ ప్రేమ సంగతి కోపిష్టి అయిన జాబిలి మామ మంగపతి (శివాజీ) కి తెలుస్తుంది. అసలు ఇంట్లో అమ్మాయిలు కాస్త తేడాగా బట్టలు వేసుకున్నా సహించలేని మంగపతికి ఈ ప్రేమ గురించి తెలుస్తుంది. దీంతో తన పలుకుబడి ఉపయోగించి చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు.

ఈ పనిలో తన లాయర్ దామోదర్ (సాయి కుమార్) మంగపతికి తోడుంటాడు. మరి చందుని బయటకు తీసుకు వచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు అసిస్టెంట్ తేజ ఏం చేస్తాడు? అసలు ఈ పోక్సో చట్టం ఏం చెబుతుంది? దీన్ని తప్పుగా ఎలా వాడుకుని అమాయకుల్ని ఇరికిస్తున్నారు? చివరకు అమాయకుడైన చందుని ఎలా బయటకు తీసుకు వచ్చాడు? ఈ కథలో జాబిల్లి తల్లి సీతారత్నం క్యారెక్టర్  ఏమిటన్నదే  ఈ మూవీ కథ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ఈ కోర్ట్ కథ ప్రస్తుత సమకాలీన పరిస్థితులను అద్ధం పట్టేలా ఉంది. ఒకప్పుడు 498 ఏ చట్టం ఎలా దుర్వినియోగం అయిందో.. ఇపుడు పిల్లల కోసం తెచ్చిన పోక్సో చట్టం బాగున్నా.. కొంత మంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సరిగ్గా దర్శకుడు ఒక చట్టాన్ని దుర్వినియోగం వల్ల ఒక వ్యక్తి లేదా అతని ఎలా సమాజంలో చులకన అవుతున్నారనేది తెరపై చక్కగా ఆవిష్కరించాడు. పోక్సో చట్టం మీద అవగాహన లేక, చేసేది చట్టరిత్యా నేరం అన్నది తెలీక చాలా మంది ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అసలు ఇలాంటి ఓ చట్టం ఉందని చాలా మందికి తెలియదు. ఈ ఒక్క చట్టమే కాదు.. కామన్ పీపుల్ కు ఇలాంటి చట్టాలు ఉన్నాయన్న సంగతి ఎవరికీ తెలియదు.  ఇలా చేస్తే తప్పు.. అది చేస్తే నేరం అని విడమరిచి చెప్పి, చట్టాల గురించి అందరికీ అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

చదువు అందరికీ చెప్పినా చెప్పకపోయినా.. చట్టం గురించి అందరికీ చెప్పాలనే బలమైన పాయింట్‌ను ప్రేక్షకుల మెదడులోకి  ఎక్కించే ప్రయత్నం చేయడంలో దర్వకుడు సక్సెస్ అయ్యాడు.  ఓ మైనర్ అమ్మాయిని ప్రేమించినా, ఆమె అంగీకారంతో ముట్టుకున్నా కూడా అది నేరం అవుతుందని ఎంత మందికి తెలుసు? అనే ఓ ప్రశ్నను ప్రియదర్శి పాత్రతో లేవనెత్తాడు దర్శకుడు. ఈ కోర్ట్ సినిమాలో ప్రధాన అంశం ఈ పోక్సో చట్టమే. మిగతాది అంతా సినిమా కోసం అద్దిన రంగులు మాత్రమే. పోక్సో చట్టం మీద దర్శకుడు ఎక్కు పెట్టిన విమర్శలు, చట్టంలోని లూప్ హోల్స్‌ను ప్రశ్నించిన తీరు దీని బాధితులు చక్కగా కనెక్ట్ అవుతారు.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేమ కథ మీదే దర్శకుడు ఫోకస్ చేశాడు. అది కొంత ఇబ్బంది పెట్టే అంశం. ఆ లవ్ ట్రాక్‌ ను క్రిస్పీగా తెరకెక్కించి ఉంటే ఈ సినిమా లెవల్ వేరే విధంగా ఉండేది. ఫస్టాఫ్ అంతా సోదిగా చెప్పినా.. ఎండింగ్ మాత్రం అద్భుతంగా ఫినిష్ చేయడం బాగుంది.   ఫస్ట్ హాఫ్‌లో అందరూ మంగపతి పాత్రకు కనెక్ట్ అవుతారు. అసలు టీనేజీలో చదువు కోకుండా.. లవ్వు గివ్వు అంటూ చాలా మంది తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. మంగపతి పాత్ర మనకు దాదాపు ప్రతి ఇంట్లో తారస పడుతుంది. అలాంటి మనుషులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు.  కానీ సెకండాఫ్‌కు వచ్చే సరికి మంగపతి దుర్మార్గుడిలా అనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తానికి శివాజీ పోషించిన మంగపతి కారెక్టర్ హైలెట్ అనిపిస్తుంది.

నటీనటుల విషయానికొస్తే..

సినిమాలో శివాజీ నటనే హైలెట్.శివాజీ పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. తనలో ఈ రేంజ్ నటుడున్నాడా అనే టైపులో తన పాత్రలో లీనమై నటించాడు.  డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఎంత మంచి నటుడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. క్రూయల్ లాయర్ పాత్రలో జీవించాడు.  మరోవైపు అతని ప్రత్యర్థి లాయర్ పాత్రలో  ప్రియదర్శి తన పాత్రకు న్యాయం చేసాడు. అతనిలో మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం, బలగంతో ప్రూవ్ అయింది. కోర్టు మూవీతో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. ఈ సినిమాలో మిగిలిన పాత్రలు పర్వాలేదనిపించాయి.

ప్లస్ పాయింట్స్

కథ, కథనం,

శివాజీ, సాయి కుమార్, ప్రియదర్శిల పోటా పోటీ నటన

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ కొంచెం ల్యాగ్

లవ్ ట్రాక్

పంచ్ లైన్..  చట్టాలు, న్యాయ వ్యవస్థలపై నమ్మకం కలిగించే ‘కోర్ట్’..

రేటింగ్: 3.25/5

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News