Sachin Tendulkar: క్రికెట్ ఓజీ సచిన్ ను డైరెక్ట్ చేసిన ఓజీ డైరెక్టర్ సుజిత్.. అసలు కారణం ఇదే..

Sachin Tendulkar: క్రికెట్ ఓజీ సచిన్ టెండూల్కర్ తో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ కలిసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ క్రికెట్ దేవుడితో డైరెక్టర్ సుజిత్ ఎందుకు కలిసాడనే విషయానికొస్తే.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 8, 2025, 01:21 PM IST
Sachin Tendulkar: క్రికెట్ ఓజీ సచిన్ ను డైరెక్ట్ చేసిన ఓజీ డైరెక్టర్ సుజిత్.. అసలు కారణం ఇదే..

Sachin Tendulkar:భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ లవర్స్ తో పాటు మాములు ప్రజానీకం కూడా ఓ దేవుడిగా కొలుస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే క్రికెట్ ఓజీ అని చెప్పాలి. అంటే క్రికెట్ కు ఒరిజినల్ గాడ్ గా పేరు గడించాడు. తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ డైరెక్టర్ సుజిత్ తో ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారతుంది. ప్రముఖ పెయింట్స్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్ కంపెనీ ‘టెక్నోపెయింట్స్’ న్యూ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. 

Add Zee News as a Preferred Source

తాజాగా ఈ యాడ్ ను సుజిత్ డైరెక్ట్ చేశారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో సుజిత్ తన అభిమాన క్రికెటర్ ను డైరెక్ట్ చేయడంతో ఎంతోగానో మురిసిపోయాడు. రీసెంట్ గా తన ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ’ ని డైరెక్ట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ను చూపించి విధానం చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఇపుడు అదే రీతిలో క్రికెట్ ఓజీ సచిన్ టెండూల్కర్ ను డైరెక్ట్ చేశారు. త్వరలో ఈ యాడ్ ప్రసారం కానుంది. దానికి సంబంధించిన వివరాలను కంపెనీ వాళ్లు అనౌన్స్ చేయనున్నారు.  మరి అభిమానులు కూడా సచిన్ ను సుజిత్ ఎలా చూపించబోతున్నాడో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

అయితే ముంబైలో సచిన్ పై రెండు ప్రచార చిత్రాలను షూట్ చేశాడు సుజిత్. . రెండు యాడ్ ఫిల్మ్స్ కూడా ఇటీవల ఓజీ చిత్రం తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ప్రముఖ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించాడు. ఓజీ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులు నెలకొల్పింది. అంతేకాదు ఈ యేడాది సంక్రాంతికి వస్తున్నాం పేరిట అత్యధిక వసూళ్లను రాబట్టిన రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమా రూ. 200 కోట్ల షేర్ తో పాటు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. అది కూడా కేవలం ఒక్క తెలుగుభాషలోనే కావడం విశేషం. 

Also Read:​  మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News