)
Madhuri Dixit Kiss: సినిమాల్లో హీరోహీరోయిన్ రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాలు నేటితరంలో కామన్‌గా వస్తున్నాయి. అయితే ఒకప్పుడు పాతతరం చిత్రాల్లో లిప్‌లాక్ సన్నివేశం అంటే అమ్మో అనేలా చేసేవారు. ప్రస్తుత తరంలో ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చాలా మామూలు అయిపోయాయి. అయితే పాత తరం హీరోయిన్లలో ఒకామె మాత్రం ముద్దు సీన్లు ఓకే చెబుతూనే అందుకు నిర్మాతలు కోటి రూపాయలు చెల్లించాలని కండీషన్ పెట్టింది. ఆ తర్వాత ఆమె ముద్దు సీన్లో నటించేందుకు అంగీకరించింది కూడా. అప్పట్లో ఈ వార్త చాలా వైరల్ అయ్యింది. అయితే ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమెకు ఎంత పారితోషకం ఇచ్చారు? అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్‌లోని ఒకప్పటి టాప్ హీరోయిన్లలో మాధురి దీక్షిత్ ఒకరుగా ఉన్నారు. ఆమె అందానికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాధురి దీక్షిత్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె టీవీ షోల్లో బిజీగా గడుపుతుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆమె నటించిన ఓ చిత్రంలో లిప్‌లాక్ సీన్ కోసం ఎంత వసూలు చేసిందనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
1988లో విడుదలైన సూపర్ హిట్ సినిమా 'దయావన్'లో వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో వారిద్దరి మధ్య ఓ లిప్‌లాక్ సీన్ ఉంది. అప్పట్లో ఈ సన్నివేశం పెద్ద హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎందుకంటే మాధురీ అప్పటికే ఓ పెద్ద స్టార్ హీరోయిన్. ఇంతటి స్టార్ డమ్ ఉన్న ఆమె ముద్దు సీన్లలో ఎలా నటించాల్సి వచ్చిందనే అనుమానాలు చాలామందికి వచ్చాయి.
ఇదే విషయమై మధూరీ దీక్షిత్ ఓ ఆసక్తికరమైన కథను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. "నేను ఆ సన్నివేశంలో నటించకూడదు. అది అంత ముఖ్యం కాకపోయినా, ఆ సీన్ కావాలని పెట్టినట్లు అనిపిస్తుంది. నేను దానికి నో చెప్పాలి." ఆమె చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నటించేందుకు అప్పట్లోనే మాధురీ దీక్షిత్‌కు కోటి రూపాయల భారీ రెమ్యూనరేషన్ కట్టుబెట్టినట్లు సమాచారం. అయితే ఈ పారితోషకం గురించి మాత్రం ఏ మాత్రం నోరు విప్పలేదు. ఈ సీన్‌తో పాటు.. ఆ సమయంలో ఆమెకు లిప్ లాకింగ్ కోసం కోటి రూపాయలు చెల్లించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిత్రసీమలో ఈ విషయం పెద్ద దుమారమే రేపింది. ఈ చిత్రం తర్వాత ఆమె ఇక ముద్దు సీన్లలో నటించకూడని నిర్ణయించుకుందట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook