తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిలను భూతద్దం పెట్టి వెతకాల్సిందే. ఈ మధ్యే శ్రీలీల ఒక్కరే తెలుగు తెరను ఏలేస్తోంది. కానీ ఆ తర్వాత పెద్దగా టాలీవుడ్ లో అలరించిన వాళ్లు లేరు. తాజాగా పుడు సుమయ రెడ్డి అనే పదహారణాల తెలుగు అమ్మాయి.. ‘డియర్ ఉమ’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అంతేకాదు కథానాయికగా ఎంట్రీ ఇవ్వడంతో రచయతగా.. నిర్మాతగా మారి ఈ సినిమాను ఎన్నో వయ్య ప్రయాలసుకు ఓర్చి నిర్మించింది. ఈ రోజు విడుదలైన ‘డియర్ ఉమ’ మూవీతో సుమయ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాలనేది ఉమా (సుమయ రెడ్డి) కల. అందుకోసం పల్లెటూరు నుంచి చదువుకోవడానికి నగరానికి వస్తుంది. అక్కడ ఆయుష్ మెడికల్ కాలేజిలో జాయిన్ అవుతోంది. మరోవైపు దేవ్ (పృథ్వీ అంబర్) రాక్ స్టార్ అవ్వాలని తన ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అమ్మాయిని ప్రేమించి విఫలమవుతాడు. దీంతో తాగుడుకు బానిసైపోతాడు. దీంతో ఇంట్లోంచి తండ్రి గెంటెస్తాడు. అయితే అనుకోని సందర్భంలో దేవ్ ఓ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో భాగంగా గుండె పెద్ద దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత అతన్ని ఉమ పనిచేసే ఆయుష్ ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఓ చోట పనిచేస్తుంటాడు. అదే సమయంలో ఉమతో దేవ్ కు పరిచయం అవుతోంది. ఉమతో ప్రయాణం తర్వాత దేవ్ కు ఓ భయంకరమైన నిజం తెలుస్తోంది. ఇంతకీ ఏమిటా నిజం ? ఈ క్రమంలో ఉమ తీవ్ర ప్రమాదంలో పడుతుంది? దీంతో దేవ్ ఉమ కోసం ఏం చేసాడనేదే ‘డియర్ ఉమ’ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
‘డియర్ ఉమ’ సినిమా ను వైద్యరంగంలో జరగుతున్న అన్యాయాల నేపథ్యంలో కథను రాసుకుంది. ముఖ్యంగా కరోనా సమయంలో హాస్పిటల్స్ ఏ విధంగా కమర్షియల్ గా ప్రవర్తించాయి. ముఖ్యంగా ఠాగూర్, త్రినేత్రుడు, క్రిమినల్ వంటి సినిమాల లైన్ గుర్తుకు వస్తాయి. సమాజంలో జరిగినా.. గతంలో వచ్చిన సినిమాలను ప్రేరణగా తీసుకొని సుమయ రెడ్డి ఈ కథను రాసుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా మన సమాజంలో వైద్యో నారాయణ హరి అని మనం వైద్యులను దైవంగా భావిస్తుంటాము. సమాజంలో ఎవరికి ఇవ్వని గౌరవం వాళ్లకు ఇస్తాము. అందులో కొంత మంది చేసే పనుల వల్ల వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని డియర్ మూవీకి కథను రాసుకుంది సునయన రెడ్డి. దర్శకుడు సాయి రాజేష్ అంతే చక్కగా తెరపై ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమాకు రధన్ సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. రాజ్ తోట కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అంతేకాదు చివర్లో ఈ సినిమాలో మంచి సందేశం ఇచ్చారు. అది తెరపై చూడాల్సిందే. వైద్యులకు కనువిప్పు కలిగించారు.
నటీనటుల విషయానికొస్తే..
ఉమ పాత్రలో సుమయరెడ్డి తొలి చిత్రమైన చక్కగా ఒదిగిపోయింది. ఇక నిర్మాత, రచయతగా.. నటిగా మంచి భవిష్యత్తు ఉంది. పృథ్వీ అంబర్ దేవ్ పాత్రలో ఒదిగిపోయాడు. అతని యాక్షన్, ఎమోషన్ సీన్స్ లో రాణించాడు. కమల్ కామరాజ్ యాక్టింగ్ బాగుంది. అజయ్ ఘోష్ నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
పంచ్ లైన్.. ‘డియర్ ఉమ’ వైద్య రంగంపై సంధించిన అస్త్రం..
రేటింగ్: 3/5
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









