Deccan Sarkar: దక్కన్ సర్కార్ మూవీ టీజర్ విడుదల.. హైలైట్ గా నిలిచిన కొత్త పోస్టర్

Deccan Sarkar teaser: ‘దక్కన్ సర్కార్’ సినిమా తెలుగు ప్రేక్షకులను కొత్త అనుభూతికి దారితీసే ప్రయత్నంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు…అని తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ చిత్ర యూనిట్. ఇక ఈరోజు విరుద్ధమైన దక్కన్ సర్కార్ పోస్టర్, టీజర్ కూడా వీరి మాటలను ప్రతిబింబించేలానే ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Written by - Vishnupriya | Last Updated : Dec 20, 2024, 09:59 AM IST
Deccan Sarkar: దక్కన్ సర్కార్ మూవీ టీజర్ విడుదల.. హైలైట్ గా నిలిచిన కొత్త పోస్టర్

Deccan Sarkar update : తెలంగాణ నేపథ్యంతో రూపొందిన ‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో.. వస్తున్న ఈ సినిమాలో.. చాణక్య, కియా రెడ్డి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు.  

Add Zee News as a Preferred Source

గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ఉద్యమంలో మనం ఎదుర్కొన్న కష్టాలు ఈ సినిమాలో ప్రతిబింబించాయి. కళా శ్రీనివాస్ ఎంతో శ్రమించి ఈ కథను తెరపై ఆవిష్కరించారు. ఇలాంటి చిత్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలి’’ అని అభిప్రాయపడ్డారు.  

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ‘‘ఇలాంటి సినిమాలు మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ఈ సినిమా విజయవంతం కావడానికి అందరూ సహకరించాలి. ఈ చిత్రానికి మేము పూర్తి మద్దతు ఇస్తాం’’ అని తెలిపారు.  

దర్శకుడు కళా శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యతను తెరపై ప్రతిబింబించాం. నిజమైన ఉద్యమకారుల జీవనశైలిని ఆధారంగా తీసుకుని ఈ కథను రూపొందించాం. పోరాటాలకు విరామం ఉండదనే కాన్సెప్ట్‌తో సినిమా తీశాను’’ అని చెప్పారు. ఆయన తెలంగాణ ఉద్యమ కళాకారులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.  

సినిమాలో నటీనటులు చాణక్య, కియా రెడ్డి, మౌనిక, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు నటించారు. ఈ సినిమా తెలంగాణ ప్రజల జీవన శైలిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దినట్లు ఈ సినిమా యూనిట్ చెప్పారు. అంతేకాకుండా.. ఈ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరు  కథ, స్క్రీన్‌ప్లే,  దర్శకత్వంలో కళా శ్రీనివాస్ చేసిన కృషిని ప్రశంసించారు. సినిమా ఆడియో లాంచ్‌ను నిజామాబాద్‌లో భారీగా నిర్వహించనున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా రూపొందించామని, మంచి విజయాన్ని అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. పెండింగ్‌ డీఏలపై అసెంబ్లీలో చర్చ

Also Read: New Year 2025: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసుల షాక్‌.. రాచకొండ పరిధిలో తీవ్ర ఆంక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News