Sanjay Gadhvi Passes away: గుండెపోటుతో ధూమ్ సినిమా డైరెక్టర్ కన్నుమూత
Dhoom director death: బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ధూమ్ చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వి హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Sanjay Gadhvi passes away at 56: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గాధ్వి గుండెపోటుతో కన్నుమూశారు. 56 ఏళ్ల వయసులో ఆయన ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన పెద్ద కుమార్తె సంజినా మీడియాకు తెలియజేశారు. మరో మూడు రోజుల్లో ఆయన 57వ ఒడిలోకి అడుగుపెట్టనున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన మృతి హిందీ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
''గాధ్వి హెల్తీగా ఉన్నారు. కానీ ఉన్నట్లుండి ఈ రోజు ఉదయం 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బహుశా ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయి ఉంటారని'' గాంధ్వీ కుమార్తె సంజినా వెల్లడించారు. అయితే గతంలో ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం. గాంధ్వీకి భార్య, సంజినితో పాటు మరో కుమార్తె కూడా ఉంది.
సినీ ప్రస్థానం
2000లో తేరే లియే’ సినిమాతో సంజయ్ దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. ఆ తర్వాత 2004లో విడుదలైన ‘ధూమ్’తో ఆయన తొలి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం రిలీజైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 2006లో ‘ధూమ్ 2’ విడుదలైంది. ఈ మూవీకి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సంజయ్ దర్శకత్వం వహించిన చివరి సినిమా 2020లో వచ్చిన ఆపరేషన్ పరిందే.
Also Read: Trisha: నేను త్రిష గురించి గొప్పగా చెప్పుకొచ్చా.. ఫైనల్ గా వివాదం పై స్పందించిన మన్సూర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook