Dhurandhar Box Office Collection Gross: ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తోంది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.552 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతటి విజయంపై స్పందించిన హీరో రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. "అదృష్టానికి మంచి అలవాటు ఉంది. సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. కానీ, ఓర్పు చాలా ముఖ్యం" అని ఆయన పోస్ట్ చేశారు. తన గత చిత్రాల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
రికార్డులు..
2025లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో 'ధురంధర్' నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో 'కాంతార: చాప్టర్ 1' (తొలి స్థానం), 'ఛావా' (రెండో స్థానం), 'సైయారా' (మూడో స్థానం) ముందున్నాయి.
Also REad: Naga Chaitanya Baby: సమంతకి కుళ్లుపుట్టే వార్త..తండ్రి కాబోతున్న అక్కినేని వారసుడు..ఏం జరిగిందంటే?
కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాపై, చిత్ర నటీనటులపై ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు మూడున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఈ చిత్రంలో హీరో రణ్‌వీర్‌తో పాటు కీలక పాత్ర పోషించిన ప్రతినాయకుడిగా నటించిన అక్షయ్ ఖన్నాకు మరింత గుర్తింపు వచ్చింది.
సీక్వెల్ అంచనాలు పెంచిన మాధవన్
ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా నటించిన మాధవన్ చేసిన వ్యాఖ్యలు అంచనాలను మరింత పెంచాయి. మాధవన్ ఈ చిత్రాన్ని ట్రైలర్‌లాంటిదిగా అభివర్ణించారు. అసలు సినిమా 'ధురంధర్ 2' అంటూ అభిమానుల్లో ఆసక్తిని రేపారు. సీక్వెల్‌లో రణ్‌వీర్ నటన మరో స్థాయిలో ఉంటుందని తెలిపారు. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన వెల్లడించారు. 'ధురంధర్ 2' సినిమాను 2026 మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also REad: School Holiday: తల్లీదండ్రులకు ముఖ్యగమనిక..రేపు స్కూళ్లకు సెలవు..బయటకు వెళ్తే ప్రాణాలతో చెలగాటమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









