Rajamouli: శ్రీదేవికి ఒక రూల్ ప్రియాంక చోప్రాకి ఒక రూల్.. ఆశ్చర్యపరుస్తున్న రాజమౌళి వైఖరి..!

SSMB29 Update: మహేష్ బాబు 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకున్న ఒక నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. గత సినిమాలలో తాను ఫాలో అయిన కఠినమైన రూల్స్ ని.. ఈ సినిమాలో ఒక నటి కోసం సడలింపు..చేసుకున్నారట ఈ దర్శకుడు. 

Written by - Vishnupriya | Last Updated : Feb 25, 2025, 02:21 PM IST
Rajamouli: శ్రీదేవికి ఒక రూల్ ప్రియాంక చోప్రాకి ఒక  రూల్.. ఆశ్చర్యపరుస్తున్న రాజమౌళి వైఖరి..!

Priyanka Chopra remuneration for SSMB29: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన RRR చిత్రం గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించి, ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం, ఆయన మహేశ్ బాబు హీరోగా నటించే కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.  

Add Zee News as a Preferred Source

అయితే, ఈ సినిమా గురించి ఒక కీలకమైన వార్త.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రియాంక చోప్రాకు ఏకంగా ₹35 కోట్ల పారితోషికం ఇవ్వడం జరిగిందంట. ఇది ఆమె కెరీర్‌లో అత్యధిక మొత్తమని చెబుతున్నారు. సాధారణంగా, రాజమౌళి తన సినిమాల్లో నటించే స్టార్స్ పారితోషికంపై చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. కానీ ప్రియాంక విషయంలో మాత్రం ఆయన కొంత సడలింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.  

ఇప్పటివరకు రాజమౌళి తన సినిమాల్లో నటీనటుల ఎంపిక విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర కోసం లెజెండరీ నటి శ్రీదేవిని సంప్రదించారు. కానీ ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు, తన పాత్రకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. దీనివల్ల, రాజమౌళి శ్రీదేవిని తప్పించి, రమ్యకృష్ణను ఎంపిక చేశారు.  

SSMB29 Update; కానీ ఇప్పుడు, మహేశ్ బాబుతో తెరకెక్కనున్న సినిమాలో ప్రియాంక కోసం రాజమౌళి పెద్ద మార్పులు చేయడానికి సిద్ధమయ్యారు. భారీ పారితోషికాన్ని మాత్రమే కాకుండా, ఆమె పాత్రను మరింత బలంగా చూపించేందుకు స్క్రిప్ట్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం.  

ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ కావడం వల్ల, రాజమౌళి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో సినిమా మార్కెట్ పెంచేందుకు, ఆమెను సినిమాలో కీలకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది రాజమౌళి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం కావొచ్చు.

Also Read: MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు

Also Read: Prabhas: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. రాజా సాబ్ మూవీ కంటే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News