Telugu directors turned actors: సినిమా రంగంలో అనేకమంది తమ మొదటి లక్ష్యాన్ని మర్చిపోయి కొత్త దారిలో ముందుకు వెళ్లినవారు ఉన్నారు. అలాంటి వారి జాబితాలో డైరెక్టర్ వశిష్ట కూడా ఒకరు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమా చేస్తున్న వశిష్ట మొదట హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. అయితే హీరోగా సక్సెస్ సాధించకపోవడంతో ఆ తరువాత దర్శకుడుగా మారారు. ముఖ్యంగా బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు ఈ డైరెక్టర్. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు బి సాధించింది. ఇక దాంతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి అవకాశం అందుకున్నారు.
వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ ప్రముఖ నిర్మాత..డిస్ట్రిబ్యూటర్. ఆయన బన్నీ, ఢీ వంటి హిట్లను నిర్మించారు. ఒక ఇంటర్వ్యూలో తన కుమారుడు ప్రయాణం గురించి ఆయన వివరించారు. వశిష్టను హీరోగా లాంచ్ చేస్తామని.. చెప్పి కొంతమంది మోసం చేసినట్లు తెలిపారు. దాంతో బాధపడ్డ వశిష్ట తన తండ్రిని అభ్యర్థించి, తనను హీరోగా పెట్టి సినిమా తీయమని అడిగాడంట.
ఈ నేపథ్యంలో కులశేఖర్ దర్శకత్వంలో.. ప్రేమలేఖ రాశా అనే సినిమా ప్రారంభమైంది. ఇందులో అంజలి హీరోయిన్‌గా నటించింది. కాలేజీ నేపథ్యంలో లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం పూర్తయిన తర్వాత విడుదలకు మాత్రం నోచుకోలేదంట. ఎందుకు అనే కారణానికి వెళితే..సినిమా హిట్ అవ్వదని భావించి విడుదల చేయలేదు అని చెప్పుకొచ్చారు వశిష్ట తండ్రి. అయితే శాటిలైట్ హక్కులు జెమిని టీవీకి అమ్మారంట. అందుకే ఈ చిత్రం అప్పుడప్పుడు జెమినీ టీవీలో వేస్తూ ఉంటారు.
ఈ ఫలితంతో వశిష్ట హీరో అవ్వాలన్న ఆసక్తిని కోల్పోయి, డైరెక్షన్ వైపు మొగ్గుచూపాడు. మొదట జయంత్ సి పరాంజీ.. తర్వాత వినాయక్ వంటి డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్‌గా పని చేశాడు. అలా అనుభవం సంపాదించి, చివరికి బింబిసార చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఘన విజయం సాధించగా, ఇప్పుడు విశ్వంభరతో మెగా హీరో చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక వశిష్ట అసలు పేరు వెంకట నారాయణ రెడ్డి అనే విషయాన్ని కూడా ఆయన తండ్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read: SBI: రుణగ్రహీతలకు ఎస్బిఐ భారీ శుభవార్త..తగ్గనున్న హోంలోన్ వడ్డీ రేట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









