Movie Tickets Price Hike: పెద్ద హీరోలకు, తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ నిర్మాత దిల్ రాజు భారీ షాక్ ఇచ్చారు. ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు ఉండదని ప్రకటించారు. దిల్ రాజు చేసిన ప్రకటనతో అటు హీరోలు.. ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీకి భారీ షాక్ తగిలింది. ఇది తాను తీయబోయే సినిమాలకు కూడా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాలను కోరబోనని స్పష్టం చేశారు. దీంతో దిల్ రాజు చేసిన ప్రకటన సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: The India House Movie: హీరో నిఖిల్ సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం
నితిన్ హీరోగా నటించిన 'తమ్ముడు' సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌వీఎస్‌సీ బ్యానర్ అధినేత, నిర్మాత దిల్ రాజు హాజరై ప్రసంగించారు. సినీ పరిశ్రమలో మార్పు రావాలని ఆకాంక్షించారు. 'నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. జూలై 4వ తేదీన విడుదల కాబోతున్న తమ్ముడు సినిమాకు సంబంధించి కూడా టికెట్ల ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగను' అని దిల్ రాజు ప్రకటించారు.
Also Read: Tatkal Ticket Rules: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! తత్కాల్ టికెట్ బుకింగ్‌కు కొత్త రూల్స్
ఈ సందర్భంగా దిల్ రాజు సినిమా టికెట్ల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి' అని తెలిపారు. 'ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచడం అనేది ఉండదు. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ ఇదే అంశం చర్చించాం' అని దిల్ రాజు సంచలన ప్రకటన చేశారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
No Ticket Price hikes for #Thammudu - Dil Raju pic.twitter.com/xWbK8X6fj8
— Rajesh Manne (@rajeshmanne1) June 11, 2025
సినీ పరిశ్రమలో దిల్ రాజు చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల నుంచి సినీ పరిశ్రమలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమపై సంచలన ఆరోపణలు చేయడం.. అనంతరం సినీ పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు త్వరలో తీసుకోబోతున్నది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో దిల్ రాజుపై నేరుగా విమర్శలు ఉన్నాయి. అనంతరం దిల్ రాజు ప్రెస్‌మీట్ నిర్వహించి వివరణ ఇచ్చినా ఆ వివాదం ఇంకా సద్దుమణగలేదు. పవన్ కల్యాణ్‌ను చల్లార్చేందుకు దిల్ రాజు ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









