రివ్యూ: దిల్ రూబా (Dilruba)
నటీనటులు : కిరణ్ అబ్బవరం, రుక్షర్ థిల్లాన్, కాథీ డావిసన్, జాన్ విజయ్, సత్య, గెటప్ శ్రీను తదితరులు
సంగీతం : సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్
ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్
నిర్మాత : విక్రమ్ మెహ్రా, సిద్ధార్ధ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి
దర్శకత్వం : విశ్వ కరుణ్
కిరణ్ అబ్బవరం హీరోగా సరికొత్త కథ, కథనాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ‘క’ మూవీతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. తాజాగా ఇపుడు ‘దిల్ రూబా’ మూవీతో పలకరించాడు. ‘క’ మూవీ తర్వాత పూర్తి భిన్నమైన కథతో తెరకెక్కిన ‘దిల్ రూబా’ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
సిద్ధార్ధ్ రెడ్డి (కిరణ్ అబ్బవరం) తన ఫస్ట్ లవ్ మేఘన అలియాస్ మ్యాగీ (కాథీ డావిసన్)తో బ్రేకప్ అవుతోంది. దీంతో ఎంతగానో కృంగిపోతాడు. ఆ తర్వాత చదువు కోసం కడప నుంచి మంగళూరుకు వెళ్లి అక్కడ ఎంఐటీలో మెకానికల్ జాయిన్ అవుతాడు. అక్కడ అతనికి అంజలి (రుక్షర్ ధిల్లాన్) పరిచయం అవుతోంది. ఆ తర్వాత సిద్దు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు వీళ్లిద్దరు కలిసారా.. ? వీరి ప్రేమకు సిద్దు ఫస్ట్ లవర్ ఎలాంటి కీ రోల్ పోషించింది. తన లైఫ్ లో థాంక్యూ, సారీ అనే సిద్ధాంతం ఎందుకు పెట్టుకున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు విశ్వకరుణ్ తన ఎంచుకున్న పాయింట్ ను ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించాడు. ముఖ్యంగా మన జీవితంలో సారీ, థాంక్యూ వంటి పదాలు ఎక్కడ వాడాలనే దాన్ని ఈ సినిమాలో చూపెట్టాడు. ముఖ్యంగా హీరో ఆటిట్యూట్ ను బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ లవర్ తో హీరో బ్రేకప్ .. ఆ తర్వాత రీ ఫ్రెష్ కోసం కొత్త ఊరు వెళ్లడం .. అక్కడ మరో అమ్మాయితో లవ్ లో పడటం వంటివి కొంత రెగ్యులర్ గా కనిపించినా.. దర్శకుడిగా తనదైన మార్క్ చూపించాడు. ఓ యాక్షన్ సీన్ బాగుంది. హీరోకు పెట్టిన ఓ క్యారెక్టరైజేషన్ సినిమాలో ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ లాజిక్ కు అందవు కానీ.. ఓవరాల్ గా మెప్పిస్తాయి. ఈ సీన్స్ ను ఇంకాస్త ఇంపాక్ట్ గా చూపించి ఉంటే వేరే లెవల్లో ఉండేది. దర్శకుడిగా తన గట్స్ ఏంటో చూపించాడు. దర్శకుడిగా తన విజువలైజేషన్ తెరపై చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కొన్ని సీన్స్ లో తన కత్తెరకు పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
కిరణ్ అబ్బవరం ‘క’ వంటి డిఫరెంట్ మూవీ తర్వాత పూర్తి స్థాయి లవ్ స్టోరీతో మెప్పించాడు. గత సినిమాల్లో కంటే ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ లో మంచి ఈజ్ చూపించాడు. హీరోయిన్స్ నటించిన రుక్షర్ థిల్లాన్, కాథీ డావిసన్ తమ అంద చందాలతో అలరించారు. మిగిలిన నటీనటుల విషయానికొస్తే.. తమ పరిధి మేరకు నటించారు.
పంచ్ లైన్.. ఓవరాల్ గా అక్కడక్కడ మెప్పించే ‘దిల్ రూబా’..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









