Mahesh Babu Trisha: టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి, ప్రముఖ నటుడు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నటనతో అభిమానులను మెప్పించారు. స్టార్ హీరోగా అత్యధిక పారితోషికం అందుకుంటూ, పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
మహేశ్ బాబు గురించి తెలుసుకునే వారు అతడిని కుటుంబం పై ఎంత ప్రేమ చూపిస్తాడో అర్థం చేసుకుంటారు. సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లి కుటుంబంతో సమయం గడపడం ఆయన ప్రత్యేకత. భార్య, పిల్లలతో విదేశీ టూర్‌లు వెళ్లడం మహేశ్‌కు అలవాటు.
Mahesh Babu Trisha Affair ; ఇంత మంచి ఫ్యామిలీ మాన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో పైన కూడా కొన్ని రూమర్స్ రాక మానలేదు. మహేశ్ బాబు, త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు కొన్ని వదంతులు హల్‌చల్ చేశాయి. ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలో మహేశ్, త్రిష మధ్య సన్నిహిత సంబంధం ఉందని వ్యాఖ్యానించడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.
త్రిష అతడు సమయంలో మహేష్ బాబుతో అఫైర్ నడిపిందని.. అయితే నమ్రత సీరియస్ అయి ఆమెకు వార్నింగ్ ఇచ్చిన తరువాత అన్ని కుదురుకున్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఈ డైరెక్టర్.మహేశ్ – త్రిష గాసిప్స్ గురించి ఆమెకు ముందే తెలియడంతో, ఈ వ్యవహారాన్ని సమర్థంగా ఎదుర్కొన్నట్లు ఆయన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ వీడియో కాస్త తెగ వైరల్ అయింది.
ఫిల్మ్ నగర్‌లో హీరోలు, హీరోయిన్ల మధ్య స్నేహం ఉండటం సహజం. మహేశ్, త్రిష కలిసి కొన్ని హిట్ చిత్రాల్లో నటించడంతో వారి మధ్య స్నేహం బలపడింది. అయితే, దీనిని అటు ఇటుగా వక్రీకరించి పుకార్లు సృష్టించడం సాధారణం. నిజానికి మహేశ్ తన కుటుంబానికి అంకితం అయిన వ్యక్తి. ఆయన గురించి తెలిసిన వారు ఈ రూమర్స్‌ను ఎటువంటి పరిస్థితిలో నమ్మరు. అందుకే ఈ దర్శకులు చేసిన వ్యాఖ్యలపై అప్పటి నుంచె ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కొంతమంది మాత్రం ఈ వీడియోని వైరల్ చేస్తూ వచ్చారు. ఇక గాసిప్స్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొంతమంది మహేశ్ బాబును సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం అసలు నిజం ఏమిటో తెలియాలని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, మహేశ్ బాబు లైఫ్‌స్టైల్ చూస్తే, ఇలాంటి విషయాలు నమ్మటం కష్టం అని అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.
ఇక మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత తన భర్త కెరీర్‌ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, పర్సనల్ మ్యాటర్స్ అన్నీ ఆమె పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









