)
Ari Update: ‘పేపర్ బాయ్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న జయశంకర్..ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ కోసం చాలా సమయం తీసుకున్నారు. తొలి చిత్రంతోనే అందమైన ప్రేమకథను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, తర్వాతి సినిమా కూడా ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఏడేళ్ల గ్యాప్.. తర్వాత అరి (My Name is Nobody) అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎందుకు ఏడేళ్ల గ్యాప్?
జయశంకర్ తన రెండో సినిమా కూడా ప్రజలు గుర్తుంచుకునేలా ఉండాలని అనుకున్నారు. అలాంటి కథను ఎంచుకోవడానికి.. లోతైన పరిశోధన చేశారు. అరి అనే పేరు అరిషడ్వర్గాలు అనే భావన నుంచి వచ్చింది. ఈ సినిమాలో కోపం, కామం, లోభం.. వంటి దోషాలపై మైథలాజికల్ టచ్‌తో కథను నిర్మించారు.
దర్శకుడు ఇందుకోసం పురాణాలు చదివి, రమణ మహర్షి ఆశ్రమం వంటి ప్రదేశాల్లో గడిపి.. పలు గురువులను కలసి మార్గదర్శనం పొందారు. అరిషడ్వర్గాలపై ఆధ్యాత్మిక కోణంలో అధ్యయనం చేసి, ప్రేక్షకులకు ఉపయోగపడే విధంగా సినిమాగా మార్చారు.
రిలీజ్‌కి ముందే అరి అనేక అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శింపబడి, దాదాపు 25 అవార్డులు గెలుచుకుంది. దేశంలోని పలువురు రాజకీయ… సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రశంసించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ప్రత్యేకంగా అభినందించారు.
ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. చిన్నారి కిట్టయ్య పాట సాంస్కృతిక కార్యక్రమాల్లో హిట్‌గా మారింది. భాగా భాగా పాట లిరిక్స్ ప్రేక్షకుల హృదయాలను తాకింది. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ వహించడంతో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. సాధారణంగా సురేష్ బాబు సినిమా తీసుకున్నప్పుడు అది మంచి కంటెంట్ ఉందని ఇండస్ట్రీ నమ్ముతుంది.
మొత్తానికి.. అరుదైన కాన్సెప్ట్..అంతర్జాతీయ గుర్తింపు, హృదయాన్ని తాకే పాటలతో అరి అక్టోబర్ 10న థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook