Raja Saab: రాజా సాబ్ సినిమా గురించి మారుతి ట్వీట్.. ఏమన్నారంటే..?

Prabhas Raja Saab Update: రాజా సాబ్ సినిమా గురించి దర్శకుడు మారుతి కొన్ని కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు.. మారుతి మాటలు విని మరిన్ని అంచనాల కూడా పెంచేసుకుంటున్నారు. ఇంతకీ ఈ దర్శకుడు ఏమి చెప్పారు అన్న విషయానికి వెళితే..

Written by - Vishnupriya | Last Updated : Jun 8, 2025, 05:48 PM IST
Raja Saab: రాజా సాబ్ సినిమా గురించి మారుతి ట్వీట్.. ఏమన్నారంటే..?

Maruthi tweet on Raja Saab: ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రం గురించి ఎంతోకాలంగా ఎలాంటి స్పష్టమైన అప్డేట్ రాకపోవడం.. వల్ల ఫ్యాన్స్‌లో కొంచెం నిరాశ ఎదురయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అడిగినా సమాధానాలు లేకపోవడంతో వారు నిస్పృహకు గురయ్యారు. అయితే ఫ్యాన్స్ ఒత్తిడిని తట్టుకోలేక చిత్ర యూనిట్ ఎట్టకేలకు విడుదల తేదీ ప్రకటించింది. డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఈ మధ్యనే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో టీజర్ తేదీ కూడా ప్రకటించారు.

Add Zee News as a Preferred Source

అయితే ఈ టీజర్.. ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్‌కు ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు ఇది అసలైనది కాదు, ఏఐతో రూపొందించిన ఇమేజ్ అని అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం వింటేజ్ ప్రభాస్ లాగా.. ఈ సినిమాలో ఉండబోతున్నారు అంటూ కామెంట్లో పెడుతున్నారు 

ఇదిలా ఉంటే, రాజా సాబ్ పనులు దర్శకుడు మారుతి పర్యవేక్షణలో వేగంగా పూర్తవుతున్నాయి.
మారుతి గతంలో ఫ్యాన్స్‌కు మాటిచ్చారు – ప్రతి నెల ఓ పాట విడుదల చేస్తామని. కానీ ఇప్పటి వరకు ఒక్క మ్యూజికల్ అప్డేట్ కూడా వెలువడలేదు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కంపోజింగ్ పూర్తైందా లేదా అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ నుంచి వస్తే ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తారు కానీ ఆ అంశంలో ఇప్పటివరకు నిశ్శబ్దమే నెలకొంది. అంతేకాకుండా ఈ చిత్రం గురించి టీజర్ ప్రకటన మినహా.. వేరే విశేషాలు కూడా అప్డేట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఫైనల్ గా మారితే ఈ సినిమా గురించి ఒక ట్వీట్ పెట్టడంతో అందరూ ఆనంద పడుతున్నారు.

మారుతి తన డెబ్యూ లవ్‌స్టోరీ ‘ప్రేమ కథా చిత్రం’ గురించి ట్వీట్ చేశారు. ‘‘ఈ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తయ్యాయి.. నన్ను నిన్నే జరిగినట్టే అనిపిస్తోంది.. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి. ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకమైనది. చాలా కాలానికి మళ్లీ నా ఫేవరెట్ జానర్‌కి వస్తున్నాను. ఈసారి హారర్ ఫాంటసీ కలిపిన వినూత్న కథతో వస్తున్నాను. రాజా సాబ్ సినిమాను నిజంగా ఓ సెలబ్రేషన్ లా తీయాలనుకుంటున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.

మొత్తానికి ఇలా మరోసారి ప్రభాస్ అభిమానులకు.. మాటిచ్చి సినిమాపై అంచనాలను పెంచేశారు డైరెక్టర్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మారుతి స్టైల్ కామెడీతో పాటు హారర్ టచ్ ఉండబోతుందని టాక్. మరి డిసెంబర్ 5న ప్రభాస్ మ్యాజిక్ మరోసారి ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.

ఇక ప్రభాస్ ప్రస్తుతం మరో చిత్రంతో కూడా బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్మీ బ్యాక్‌డ్రాప్ స్టోరీలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్.. ఎంతో కష్టపడ్డాడు అనే వార్తలూ వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: కొత్త మంత్రుల పేర్లు అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్.. వారికి నిరాశే!

Also Read:  పక్కా హైదరాబాదీ మాగంటి గోపీనాథ్  సినీ, రాజకీయ నేపథ్యం ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News