Raghavendra Rao : సీత చెప్పిన కోణంలో రామాయణం.. రాఘవేంద్రరావు కొత్త మూవీ
Raghavendra Rao Next Film title Sita Cheppina ramayanam : రామాయణంలోని ఒక కోణాన్ని తన స్టైల్‌లో స్క్రీన్‌పై చూపించేందుకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను సీత చెప్పిన రామాయణం అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నారట.
Director Raghavendra Rao another Mythological Film title finalized as Sita Cheppina ramayanam : ఇటీవల మళ్లీ పౌరాణిక చిత్రాలను వరుసగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది. మైథాలజికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో (Mythological background) తెరకెక్కుతోన్న ప్రభాస్ ఆదిపురుష్ (Adipurush) లాంటి మూవీల లిస్ట్ చాలానే ఉంది.
అయితే రామాయణ, మహాభారత, భాగవతంలాంటి ఇతిహాసాల్ని ఏ కోణంలోనైనా, ఎన్ని విధాలుగానైనా స్క్రీన్‌పై ఆవిష్కరించుకునేందుకు వెసులుబాటు ఉంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీలో ఇప్పటికే చాలా వచ్చాయి. కొందరు డైరెక్టర్లు ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని.. వాటిని సోషలైజ్ చేసి తెరకెక్కించారు.
ఇక రామాయణంలోని (Ramayanam) ఒక కోణాన్ని తన స్టైల్‌లో స్క్రీన్‌పై చూపించేందుకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సిద్ధమవుతున్నారు. రామాయణంలోని ఒక అద్వితీయ ఘట్టాన్ని.. సీతమ్మవారి కోణంలో ఆవిష్కరించేందుకు రాఘవేంద్రరావు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాను సీత చెప్పిన రామాయణం (Sita Cheppina ramayanam) అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నారట. ఇప్పటికే సీత చెప్పిన రామాయణం టైటిల్ కూడా ఫైనల్ అయ్యింది.
Also Read : Vicky Katrina Wedding OTT Platform: విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ పెళ్లి ఫుటేజ్ కోసం రూ.100 కోట్ల ఆఫర్!
సీత చెప్పిన రామాయణం మూవీకి సంబంధించిన స్టోరీ కూడా సిద్ధంగా ఉందట. ఈ మూవీని పాన్ ఇండియా (Pan India) లెవెల్లో రూపొందించాలని అనుకుంటున్నారట. కీలక పాత్రల్లో నటించే.. నటుల కోసం ఇప్పటికే హంటింగ్ మొదలుపెట్టారట దర్శకేంద్రుడు. త్వరలోనే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Also Read : Teenmar Mallanna:బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న-సీఎం కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook