Passion Movie First Look Poster: సుధీస్, అంకిత జంటగా.. అరవింద్ జాషువా డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ పేషన్. ఎమోషనల్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో REDANT క్రియేషన్ బ్యానర్‌పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, హిమజ అశ్విన్ ముశర్న్, బెనర్జీ, చందన, అర్చన తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనంద్ మూవీ నుంచి అరవింద్ జాషువాతో తనకు పరిచయం ఉందని.. అప్పట్లోనే తనలో స్టోరీ టెల్లింగ్ రైటింగ్ క్రియేటర్ ఉన్నాడని అనిపించిందని చెప్పారు. జాషువా రాసిన పేషన్ అనే నవలను చదివానని.. చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ అని.. చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఫస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉందన్నారు. మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
అనంతరం ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. పేషన్ నవల చదివిన తర్వాత అందరూ ఇన్‌స్పైర్ అయి సినిమాగా తీసుకురావాలనే తపనను అందరూ అర్థం చేసుకున్నారని అన్నారు. శేఖర్ కమ్ముల ఆశీస్సులతోనే ఈ సినిమా అయిందన్నారు. ఆయన ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా ఈ సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చారని అన్నారు. ఈ సినిమా చాలా మంచి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
దర్శకుడు అరవింద్ జాషువా మాట్లాడుతూ.. పేషన్ మూవీ కాన్వాస్ చాలా పెద్దదని చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు చదివే ఓ ఫ్యాషన్ కాలేజీలో ఒక సామాన్యుడు చేరితో ఎలా ఉంటుందో ఒరిజనల్‌గా తాను ఫీల్ అయి ఈ కథ రాశానని చెప్పారు. తాను శేఖర్ కమ్మలకు ఏకలవ్య శిష్యుడిని అని.. ఆయనతో తనకు 20 ఏళ్లుగా ప్రయాణం ఉందన్నారు. టైటిల్‌లో చెప్పినట్లుగానే ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కూడిన లవ్ స్టోరీ అని చెప్పారు. ఇందులో సుధీస్, అంకిత పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయన్నారు. త్వరలోనే సినిమా థియేటర్స్‌లో తీసుకువస్తామని.. ఆడియన్స్ సపోర్ట్ చేయాలని కోరారు.
టెక్నీకల్ టీమ్:
==> ప్రొడక్షన్ హౌస్: REDANT క్రియేషన్
==> డైరెక్టర్: అరవింద్ జాషువా
==> ప్రొడ్యూసర్స్: నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్
==> DOP: సురేష్ నటరాజన్
==> మ్యూజిక్: సామ్ హెన్రీ
==> ఎడిటర్: నాగేశ్వర రెడ్డి
==> ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
==> కాస్ట్యూమ్ డిజైనర్: శ్రీకాంత్
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుబ్బు RV
==> ఎగ్జిక్యూటివ్ మేనేజర్: లతీఫ్ ch
==> ప్రొడక్షన్ మేనేజర్: రవీందర్
==> PRO: తేజస్వి సజ్జా
Also Read: NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
Also Read: Indian Navy: పాక్ సరిహద్దుల్లో భారత నేవీ మిసైల్ ప్రయోగం.. యుద్ధనౌకల మోహరింపు వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









