Disha Patani Sister Video: హ్యాట్సాఫ్ అక్కా.. పసికందును కాపాడి తల్లికి అప్పగించిన దిశా పటానీ సోదరి.. వీడియో వైరల్...

Khushboo patani rescued baby: ఉత్తర ప్రదేశ్ లో పాడుబడ్డ భవనంలో ఒక చిన్నారి ఏడ్పులు విని దిశాపటానీ సోదరి అక్కడకు వెళ్లింది. అక్కడ ఒక చిన్నారి కింద పడేసి ఉంది. దీంతో  హీరోయిన్ సోదరి ఆమెను ప్రేమతో దగ్గరకు తీసుకుని కాపాడింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 21, 2025, 02:42 PM IST
  • గొప్ప మనసు చాటుకున్న ఖుష్బూ పటానీ..
  • నెట్టింట ప్రశంసలు..
Disha Patani Sister Video: హ్యాట్సాఫ్ అక్కా.. పసికందును కాపాడి తల్లికి అప్పగించిన దిశా పటానీ సోదరి.. వీడియో వైరల్...

Disha patani sister Khushboo patani rescued abandoned baby child: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఒక పాడుబడిన భవనంలో నుంచి చిన్నారి ఏడ్పులు విన్పించాయి. దీంతో దిశాపాటానీ సోదరి  ఖుష్బూ పటానీ అక్కడకు వెళ్లింది. వెంటనే చిన్నారిని తీసుకుని దగ్గరలోకి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అంతే కాకుండా.. ఆ చిన్నారికి సపర్యలు చేసింది. ఆ చిన్నారికి గాయాలకు ట్రీట్మెంట్ కూడా చేయించింది.  ఖుష్బూ పటానీ వాకింగ్ కు వెళ్లినప్పుడు పాడు బడ్డ భవనం చిన్నారి ఏడ్వడంను గమనించింది.

Add Zee News as a Preferred Source

వెంటనే గోడ దూకి మరీ అక్కడకు వెళ్లి చూసింది. ఇంతలో చిన్నారిని ఎవరో పడేసి వెళ్లిపోయారు. దీంతో ఆమెను కాపాడింది. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఈ ఘటనపై ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.అదే విధంగా  ఖుష్బూ పటానీ.. వెంటనే తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ లు చేసింది.

 

ఈ క్రమంలో ఈ ఘటనపై నెటిజన్లు మాత్రం..  ఖుష్బూ పటానీ చేసిన పనిని ఒక రేంజ్ లో దేవతలా కొనియాడారు. ఒక నిండు ప్రాణం కాపాడవని ప్రశంసలు కురిపించారు.  అయితే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఆ ప్రాంతానికి దగ్గరలోని ఒక ఇంట్లోని పసికందును గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేశారని.. బైటపడింది. ఆ చిన్నారిని తిరిగి ఆ  పోలీసులు,  ఖుష్బూ పటానీలు తల్లిదగ్గరకు చేర్చారు. అంతేకాకుండా.. ఈ ఘటన చూసినప్పుడు చాలా భావొద్వేగానికి గురైయినట్లు నటిచెప్పింది.  ఖుష్బూ పటానీ గతంలో ఆర్మీలో మేజర్ గా పనిచేసింది.

Read more: Viral Video: వదల బొమ్మాళీ వదల.. చెట్టు మీద ఎక్కిన కూడా యువతిని కుమ్మేసిన పొట్టేలు.. ఫన్నీ వీడియో వైరల్..

ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకుంది. ఇక మరోవైపు దిశా పటానీ సినిమాల్లో నటిస్తుంది. ఖుష్బూ పటానీ చూపిన చొరవ, ధైర్యం, సమయస్పూర్తీకి స్థానిక ప్రజలతో పాటు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News