)
Divvela Madhuri reveals behind her elimination from bigg boss telugu season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం రచ్చ రాజేస్తుంది. మెయిన్ గా వైల్డ్ కార్డ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పచ్చళ్ల పాప రమ్య, ఇప్పుడు దివ్వెల మాధురీ ఇద్దరు ఒకరి తర్వాత మరోకరు బైటకు రావడం సంచలనంగా మారింది. మరోవైపు దివ్వెల మాధురీ తాను బిగ్ బాస్ హౌస్ నుంచి కావాలని బైటకు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో నటి దువ్వాడ మాధురి కేవలం రెండు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో అత్యల్ప ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతో మాధురి షాక్‌కు గురయ్యారు. మొదట్లో ఫైర్ బ్రాండ్ గా హౌస్ లో దివ్వెల మాధురీ హల్ చల్ చేసిన ఆ తర్వాత నాగార్జున క్లాస్ పీకిన తర్వాత మాత్రం చాలా చేంజ్ అయ్యిందని ఆడియన్స్ చెబుతున్నారు.
ముఖ్యంగా గేమ్ లో, అదే విధంగా బాండింగ్ లు ఏమిలేదన్నా దివ్వెల మాధురీ.. తనూజతో బాండింగ్ పెట్టుకుంది. దీంతో ఇద్దరు కూడా హౌస్ మెట్స్ కు ఊహించని ట్విస్ట్ లు ఇచ్చారు. మరొవైపు దివ్వెల మాధురీ, భరణి ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ కూడా అంటూ కూడా భలే టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా ఓట్లు తక్కువ రావడంతో మాధురి తన ప్రయాణాన్ని ముగించాల్సి వచ్చింది.
హౌస్ నుంచి వెళ్లిపోయే ముందు మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను ఎలిమినేట్ అవుతానని ముందే ఊహించానని, అసలైతే తానే బైటకు రావాలని బలంగా కోరుకున్నట్లు కూడా చెప్పారు. నవంబర్ 4న తన భర్త శ్రీనివాస్ పుట్టినరోజు ఉండటంతో ఆ సమయంలో ఆయనతో ఉండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు.
దిమ్మతిరిగే రెమ్యూనరేషన్!
మాధురి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మూడు వారాల వ్యవధిలో వారానికి రూ. 3 లక్షలు వరకు పారితోషికం అందుకున్నారని సమాచారం. మొత్తం మీద ఆమె రూ. 9 లక్షలు వరకు సంపాదించినట్లు సమాచారం.