Anushka: పవర్ స్టార్ సినిమాకి అనుష్క నో.. అలాంటి క్యారెక్టర్ చెయ్యను అంటూ క్లారిటీ..!

Anushka Missed Movies : తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్స్ లో.. అనుష్క ఒకరు. ఈ హీరోయిన్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. అయితే అనుష్క పవర్ స్టార్ తో చేయాల్సిన రెండు సినిమాలకు మాత్రం నో చెప్పిందట. దానికి గల కారణాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Written by - Vishnupriya | Last Updated : Mar 16, 2025, 01:04 PM IST
Anushka: పవర్ స్టార్ సినిమాకి అనుష్క నో.. అలాంటి క్యారెక్టర్ చెయ్యను అంటూ క్లారిటీ..!

Pawan Kalyan missed movies: టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. కానీ, కొన్నిసార్లు కొన్ని ఆసక్తికరమైన కాంబినేషన్లు వెండితెరపై అసలు రాకుండానే మిస్ అవుతాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్ కూడా అలాంటిదే. వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి ఒక్క సినిమాకూడా చేయలేదు. అయితే, వీరి కాంబినేషన్‌లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.  

Add Zee News as a Preferred Source

 పవన్ కళ్యాణ్ నటించిన "బంగారం" సినిమాకు తొలుత హీరోయిన్‌గా అనుష్క శెట్టిని ఎంపిక చేశారు. కానీ, ఆ సినిమాలో అనుష్క పాత్ర చిన్నదిగా ఉండటంతో ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారంట. అనంతరం ఆ పాత్రను త్రిష చేసింది. 

ఈ సినిమాలో క్లైమాక్స్‌లో ట్రైన్ సీన్‌ లో పవన్ కళ్యాణ్ త్రిషకు చేయి అందించే సన్నివేశంలో త్రిష కనిపిస్తుంది. ఈ సీను కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉంటుంది. మొదటగా ఈ పాత్ర కోసం అనుష్కనే ఫైనల్ చేశారు, కానీ ఆమె తక్కువ స్క్రీన్ స్పేస్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది.  అంతటి చిన్న పాత్ర తాను చేయను అని అప్పట్లో క్లారిటీ ఇచ్చిందంట ఈ హీరోయిన్.
  

మరోపక్క..ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా "విక్రమార్కుడు". అయితే, ఈ సినిమా తొలుత పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ, కొన్ని కారణాల వల్ల పవన్ ఈ ప్రాజెక్ట్‌ను చేయలేదు.  ఆయన స్థానంలో రవితేజ హీరోగా నటించగా, అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా మిస్ కావడం పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ కలిగించిందని చెప్పుకోవచ్చు.  

ఈ రెండు సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్, అనుష్క శెట్టి కలిసి నటించే అవకాశం ఉండగా, అది మిస్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికీ ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించకపోవడంతో, ఫ్యాన్స్ ఒక సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Also read: Salary Hike: ఈ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, ఏకంగా 62 వేలు పెరగనున్న జీతం, ప్యూన్ నుంచి క్లర్క్ వరకు ఎవరికెంత పెరుగుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News