Drama Juniors Season 8: అనిల్ రావిపూడి, రోజా న్యాయనిర్ణేతలుగా డ్రామా జూనియర్స్ సీజన్ 8..!

Drama Juniors Season 8 : తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలని అందిస్తూ వినోదం పంచుతున్న ఛానల్ జీ తెలుగు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీస్తూ ప్రేక్షకాదరణతో విజయవంతంగా 7 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ 8 ఏప్రిల్ 12న ప్రారంభం కానుంది.

Written by - Vishnupriya | Last Updated : Apr 10, 2025, 03:33 PM IST
Drama Juniors Season 8: అనిల్ రావిపూడి, రోజా న్యాయనిర్ణేతలుగా డ్రామా జూనియర్స్ సీజన్ 8..!

Drama Juniors Season 8 Judges : తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలని అందిస్తూ వినోదం పంచుతున్న ఛానల్.. జీ తెలుగు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీస్తూ ప్రేక్షకాదరణతో విజయవంతంగా 7 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్.. కొత్త సీజన్ 8 ఏప్రిల్ 12న, ప్రారంభం కానుంది.

Add Zee News as a Preferred Source

సంవత్సరాల నుంచి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్న డ్రామా జూనియర్స్ 8వ సీజన్‌తో మరోసారి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమైంది. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని పిల్లల్లో దాగున్న నటనా ప్రతిభను వెలికి తీసే ఉద్దేశ్యంతో కొత్త సీజన్ని ప్రారంభిస్తోంది. ఈ షో ను ఎవర్గ్రీన్ ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ హోస్ట్ చేయనున్నారు. పిల్లల స్కిట్లకీ, సుధీర్ కామెడీ పంచులు, టైమింగ్ తోడైతే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం.

ప్రతిభ గల చిన్నారులను మరింత ప్రోత్సహించి వారిని ఆశీర్వదించేందుకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, నటి రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. వరుస హిట్ సినిమాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రాణిస్తున్న అనిల్ రావిపుడి జీ తెలుగు డ్రామా జూనియర్స్ 8 షో ద్వారా బుల్లితెరపై మొదటిసారిగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇక, డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్‌ ఎపిసోడ్ ముఖ్య అతిథులుగా ప్రముఖ నటులు జగపతి బాబు, ఆమని హాజరై చిన్నారుల్లో మరింత ఉత్సాహం నింపనున్నారు. 

వీళ్ళ  నటనా ప్రతిభ కనబరిచే అద్భుతమైన ప్రదర్శనలు, సరదా సంభాషణలతో డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఘనంగా ప్రారంభం కానుంది.
ఇక, ఈ సీజన్లో పాల్గొనే చిన్నారులు రెండు జట్లు బాయ్స్ టీమ్, గర్ల్స్ టీమ్ గా  తలపడనున్నారు. గర్ల్స్ టీమ్ కి  యాంకర్ లాస్య, బాయ్స్ టీమ్ కి  త్రినయని సీరియల్ తో  జీ తెలుగు ప్రేక్షకులను అలరించిన నయని మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. మెంటర్ల సారథ్యంలో అలరించే స్కిట్స్ తో  అంతులేని వినోదం పంచే ఈ కార్యక్రమాన్ని జీ తెలుగు వేదికగా ప్రతి శనివారం మీరూ తప్పకుండా చూడండి.

చిన్నారుల ప్రతిభను వెలికితీసే డ్రామా జూనియర్స్ సీజన్ 8.. ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే.

Read more: Renu desai on Marriage: రెండో పెళ్లి అప్పుడు చేసుకుంటా..!.. మనసులో మాటబైటపెట్టిన రేణుదేశాయ్.. మ్యాటర్ ఏంటంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News