దుల్కర్ సల్మాన్ హీరోగానే కాకుండా నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘కాంత’. రానా దగ్గుబాటి మరో ముఖ్యపాత్రలో నటిస్తూ.. ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
ఈ చిత్రాన్ని 1950 బ్యాక్ డ్రాప్ లో ప్రారంభమవుతుంది. అయ్య అలియాస్ కోదండ రామ్ (సముద్రఖని) పెద్ద దర్శకుడు.ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శాంత’ ను తెరకెక్కిద్దామనుకుంటాడు. గతంలో నట చక్రవర్తి టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) ఆ ప్రాజెక్ట్ ప్రారంభమై ఆగిపోతుంది. ఆ తర్వాత ‘శాంత’ ప్రాజెక్ట్ కోసం కుమారి (భాగ్యశ్రీ బోర్సే) దర్శకుడికి దొరుకుతుంది. దీంతో మళ్లీ ఈ సినిమాను తెరకెక్కిద్దామనుకుంటాడు. కానీ నిర్మాత మాత్రం టీకే మహాదేవన్ అయితేనే నిర్మిస్తానని చెబుతాడు. అయ్యకు ఇష్టం లేకపోయినా.. నిర్మాత ఒత్తడి మేరకు ఓకే చెబుతాడు. హీరో ఎంట్రీ ఇచ్చాకా.. ఈ సినిమా పేరును ‘శాంత’ నుంచి ‘కాంత’గా మారుస్తాడు. అంతేకాదు దర్శకుడు సెట్లో ఉన్న .. తన ఇష్ట ప్రకారమే చిత్రాన్ని తెరకెక్కిస్తుంటాడు హీరో. ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ నడుస్తుంటాయి. అయితే ‘కాంత’ షూటింగ్ చివరి రోజున హీరోయిన్ కుమారి హత్యకు గురవుతుంది. ఆమెను ఎవరు చంపారు.. ? హీరోకు, దర్శకుడికి మధ్య ఎందుకు అభిప్రాయ బేధాలు వచ్చాయి. కుమారి హత్యకు గల కారణాలు ఏమిటి ? చివకు ఆ చిత్రం విడుదలైందా లేదా అనేదే ‘కాంత’ మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ .. 1950ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని సినిమా నేపథ్యంలో తెరకెక్కించాడు. ఇప్పటికే మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి బయోపిక్స్ లో సినిమా రంగానికి సంబంధించిన కథలను చూసాము. కాంత కూడా దాదాపు అదే తరహాలో కొనసాగుతుంది. దర్శకుడు .. మాములుగా స్టేజ్ పై చిన్న పాత్రలు వేసుకునే హీరోను పెద్ద స్టార్ ను చేస్తాడు. ఓ సినిమా కథ విషయంలో ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఏర్పడుతుంది. తాను తెరకెక్కించబోయే ‘శాంత’ సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోతుంది. కానీ కథానాయకుడు ఆ క్యారెక్టర్ ను చనిపోకూడదు. అభిమానులు తనను అలా చూడరు అనే కోణంలో చెబుతాడు. క్లైమాక్స్ ను మార్చమనే సన్నివేశాలు.. అప్పటి నుంచే హీరో, దర్శకులు మధ్య కొన్ని సీన్స్ విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు వస్తున్నాయనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాడు. ఇక్కడ ఓ అనామకుడిని నేనే స్థార్ ను చేసాశానే అహంభావం దర్శకుడి పాత్రలో చూపించాడు దర్శకుడు. అటు డైరెక్టర్ గా తనకు అవకాశం మాత్రమే ఇచ్చాడు.. నటుడిగా తాను ప్రూవ్ చేసుకున్నాని అహంకారం హీరోలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇద్దరి పాత్రల మధ్య ఈగో క్లాషెస్ చివరి సాగుతుంది. కానీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అనేది ప్రేక్షకులకు అంత కన్వన్సింగ్ గా ఉండదు.
అయితే హీరోను అక్రమంగా దర్శకుడు జైల్లో పెట్టిస్తాడు. ఆ తర్వాత అతన్ని విడిపిస్తాడు. ఈ విషయం తెలిసి హీరో దర్శకుడిపై కోపం పెంచుకుంటాడు. తనను తొక్కడానికి దర్శకుడు చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకు ఎక్కదు. మరోవైపు హీరోయిన్ ..హీరో మనసు తెలుసుకొని అతనికి శారీరకంగా దగ్గరవుతుంది. అయితే హీరోకు పెళ్లైనా.. హీరోయిన్ కుమారిని రెండో పెళ్లి చేసుకుంటాని చెబుతాడు. కానీ అనుకోకుండా ఆమె చనిపోవడం.. ఆమెను చంపిన హంతకుడిని పట్టుకునేందుకు దేవరాజ్ అలియాస్ ఫోనెక్స్ పాత్రలో రానా దగ్గుబాటి ఎంట్రీ.. ఆ తర్వాత చిత్ర యూనిట్ లో ఒక్కోక్కరిని స్టూడియోలో పోలీస్ ఆఫీసర్ ఇంటారాగేషన్ చేసే సీన్స్ తో సెకండాఫ్ నడిపించాడు. చివరకు హంతకుడిని పట్టుకోవడంలో పోలీస్ వాళ్లు సక్సెస్ అయ్యారా అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా.. అది స్లో నేరేషన్ లో సాగడం ఇబ్బంది పెడుతుంది. దర్శకుడు పాత కాలం నాటి సెట్స్ ను రీ క్రియేట్ చేయడం .. అప్పట్టో షూటింగ్ ఎలా చేసేవారనే విషయాలను ఇప్పటికే ఎన్టీఆర్, సావిత్రి బయోపిక్ లో చూసిందే. హీరో, హీరోయిన్ మధ్య లవ్, అట్రాక్షన్.. హీరో మామను మీడియా టైకూన్ గా హీరోయిన్ ను బెదిరిండం వంటి సీన్స్ రొటిన్ గా అనిపిస్తాయి. అయితే చివర్లో హీరో యాక్టింగ్ కు దర్శకుడు అయ్య చప్పట్లు కొట్టడం.. చివర్లో సినిమాను విడుదల చేసారా..అనేది ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. సినిమా నిర్మాణ విలువులు, ఆర్ట్ వర్క్ బాగుంది. ఆనాటి కాలానికి సంబంధించిన ఇళ్లు సెట్టింగ్స్ వంటివి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
నటీనటుల విషయానికొస్తే..
దుల్కర్ సల్మాన్ మరోసారి నట చక్రవర్తి టీకే మహదేవన్ పాత్రలో జీవించాడు. అతను ఎంత మంచి నటుడున్న విషయంలో ఈ సినిమాలో దర్శకుడు చూపించే ప్రయత్నించాడు. ప్రతీ సన్నివేశంలో తన మార్క్ చూపించాడు. క్లైమాక్స్ లో అతని నటన ఆకట్టుకుంటుంది. భాగ్యశ్రీ బోర్సే కుమారి పాత్రలో అందంతో పాటు నటనతో ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ లో మహానటిలో కీర్తి సురేశ్ ఛాయలు కనిపిస్తాయి. మంచి ఈజ్ తో నటించింది. నటిగా మంచి భవిష్యత్తు ఉంది. అంతేకాదు హీరోతో ఇంటిమేట్ సీన్స్ లో ఎలాంటి మొహమాటం లేకుండా యాక్ట్ చేసింది. అటు సముద్రఖని అయ్య పాత్రలో జీవించాడు. హీరోతో సరిసమానమైన పాత్రలో సినిమా క్లైమాక్స వరకు హీరోతో పోటీ పడి నటించాడు. ఇంటర్వెల్ తర్వాత రానా దగ్గుబాటి ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మంచి ఈజ్ తో నటించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
దుల్కర్, సముద్రఖని పోటా పోటీ నటన
ఇంటర్వెల్ బ్యాంగ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
సెకండాఫ్
బోర్ కొట్టే సీన్స్
బ్యాటమ్ లైన్.. ఆనాటి కాలాన్ని గుర్తు చేసే ‘కాంత’ ..
రేటింగ్: 3/5
Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!
Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









