ED Notice to Mahehsh Babu: హీరో మహేష్ బాబు కు ఈడీ నోటీసులు..

ED Notice to Mahehsh Babu: టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. గతంలో ఈయన పలు ప్రకటనలకు ప్రచారకర్త వ్యవహరించారు. దీనికి సంబంధించి అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మహేష్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 22, 2025, 08:37 AM IST
ED Notice to Mahehsh Babu: హీరో మహేష్ బాబు కు ఈడీ నోటీసులు..

ED Notice to Mahehsh Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమ అగ్ర నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సూరాణా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ ల వ్యవహారంలో అక్రమంగా నగదు లావాదేవీల నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈనెల 27న మహేష్ బాబు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ యాడ్ ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు రూ. 3.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరిగినట్టు లేదు. ఈ నేపథ్యంలో మహేష్ బాబును ఈడీ ఆఫీసుకు పిలిపించి విచారించనున్నారు.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా మహేష్ బాబుకు రెమ్యునరేష్ కింద ఇచ్చింది మనీ లాండరింగ్ డబ్బులనేది ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే మహేష్ బాబు అండ్ టీమ్ ఈ విషయమై ఎలా స్పందిస్తారనేది చూడాలి. అయితే.. తెలుగులో అత్యధిక యాడ్స్ చేస్తూ రెండు సంపాదిస్తున్న నటుల్లో మహేష్ బాబు ముందు వరసలో ఉంటారు. ఇకపై యాడ్స్ చేసే విషయంలో మహేష్ బాబు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. ప్రెజెంట్ మహేష్  చేతిలో దాదాపు 20కు  పైగా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ఉన్నాయి. సినిమాల్లో నటించే దాని కన్నా.. ఎక్కువ యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నారు మహేష్ బాబు. ఇప్పటి వరకు మహేష్ బాబుకు సంబంధించి టాక్సుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదనేది టాక్. ఈడీ నోటీసులపై మహేష్ బాబు స్వయంగా హాజరు అవుతారా.. ఆయన తరుపున ఎవరైనా లాయర్ ను పంపిస్తారా అనేది చూడాలి.

మహేష్ బాబు విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తి స్థాయి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఒడిషాలో కీలకమైన షెడ్యూల్ పూర్తైయింది. ఈ సినిమాలో మరో కథానాయికగా కూడా నటిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులతో పాటు హాలీవుడ్ కు చెందిన నటులు ఈ సినిమాలో భాగస్వామిగా మారారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలైలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News