Ed Sheeran Sings Devara Song: ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా విడుదలైన తర్వాత చాలామంది ట్రోల్ చేసినప్పటికీ.. సైలెంట్ గా రూ.600 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. అటు ఓటీటీ లో వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పాటలు, ఎన్టీఆర్ పేరు బాగా వైరల్ గా మారుతున్నది. అంతేకాకుండా దేవర 2 పైన కూడా హైప్ పెరిగేలా కనిపిస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఫుట్బాల్ లెజెండ్స్ కి బర్తడే విషెస్ తెలియజేస్తూ ఎన్టీఆర్ ఫిఫా వరల్డ్ కప్ ఎమోజీను కూడా పెట్టడం జరిగింది.
అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాలోని చుట్టమల్లె సాంగ్ ను హాలీవుడ్ సింగర్ అయిన ఎద్ శీరన్ పాడడంతో మరొకసారి ఎన్టీఆర్ అభిమానులు ఆనందపడుతున్నారు. ఎద్ శీరన్(ED SHEERAN).. ఇండియాలో మ్యాథమెటిక్స్ టూర్ లో ఉన్న ఈ సింగర్ బెంగళూరులో లైవ్ షో చేయడం జరిగింది. ఇందులో సింగర్ శిల్పారావుతో కలిసి దేవర చిత్రంలోని చుట్టమల్లె సాంగ్ ని అభిమానుల కోసం పాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ గా మారుతున్నది.
కర్ణాటకలో వున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బళ్లారిలో ఏకంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ అభిమానులను కుషీ పరిచేందుకే శిల్పారావు తో పాటుగా ఎద్ శీరన్ ఈ పాటను పాడారు. దీంతో అభిమానులు సైతం ఎన్టీఆర్ సినిమా పాటలకు ఎలాంటి సరిహద్దులు లేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎద్ శీరన్ నోట తెలుగు పాట వినడం అందరికీ చాలా స్పెషల్ అంటూ కూడా పలు రకాల కామెంట్స్ ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు దేశమంతటా దేవర సినిమాలోని పాటలు ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉన్నాయని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
గతంలో ఏఆర్ రెహమాన్ తో కలిసి ప్రేమికుడు చిత్రంలోని ఊర్వశి ఊర్వశి అనే పాటను పాడిన ఎద్ శీరన్ ఇప్పుడు ఎన్టీఆర్ పాటను పాడడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Also Read: Kiran Royal illegal Affairs: జనసేన నేత కిరణ్ రాయల్ భాగోతాలు త్వరలో సస్పెన్షన్ వేటు
Also Read: Tirumala: తిరుమల భక్తులకు అలెర్ట్.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









