Eesha Rebba: త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా అరవింద సమేత. 2018లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జగపతిబాబు, నవీన్ చంద్ర విలన్స్ గా కనిపించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఈషా రెబ్బ కూడా చిన్న క్యారెక్టర్ లో నటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఈ సినిమా విడుదలైన చాలా రోజుల తరువాత ఈశా ఈ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు అమ్మాయి ఈశా తెలుగులో ఎన్నో సినిమాలలో కనిపించింది. అయితే సినిమాలలో పెద్దగా అవకాశం రాకపోవడంతో కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. కాగా తాజాగా ఈషారెబ్బ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అరవింద సమేత వీరరాఘవ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఈషా ఈ జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి చెబుతూ.. ‘నాగవంశీ, త్రివిక్రమ్ గారు వచ్చి నాకు అరవింద సమేత కథ చెప్పి అడిగారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అందులో మీరు ఒకరు అని చెప్పారు. నేను మొదట చెయ్యను అని చెప్పాను. నేను మెయిన్ లీడ్స్ చేద్దామనే అనుకుంటున్నాను.. చిన్న పాత్రలు కాదు అని నో చెప్పాను. కానీ త్రివిక్రమ్ గారు కథ మొత్తం చెప్పి లీడ్స్ లో ఒక క్యారెక్టర్ అనే చెప్పారు. సరే చూద్దాము అని ఓకే చెప్పాను. షూట్ కి వెళ్లే ఒక్క రోజు ముందు నేను ఆ సినిమాకు సరే అని చెప్పాను. అదే మొదటిసారి నేను పెద్ద సినిమా చెయ్యడం.‌దాంతో షూటింగ్, స్టార్ కాస్ట్.. అంతా కొత్తగా అనిపించింది. షూటింగ్ సమయంలో అంతా హ్యాపీగానే గడిచిపోయింది. నన్ను సినిమా విడుదలకు ముందు సెకండ్ లీడ్ గా అనౌన్స్ చేస్తా అన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా అది అనౌన్స్ చేయలేదు. చేస్తే నాకు హెల్ప్ అయ్యేది పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి. మా మేనేజర్ ని కూడా అడిగాను ఇలా సెకండ్ లీడ్ గా అనౌన్స్ చేస్తా అన్నారు చేయలేదు.. ఒకసారి సినిమా వాళ్లని కనుక్కోమన్నాను.”


“షూట్ అయిపొయింది, సినిమా రిలీజ్ అయిపొయింది, కాని నేను హ్యాపీగా లేను.  అందుకే అరవింద సమేత విషయంలో కొంచెం బాధపడ్డాను. ముఖ్యంగా నా సీన్స్ కొన్ని ఎడిటింగ్ లో తీసేసారు. నాతో ఇంకో సాంగ్ ఉంటుంది అన్నారు, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఆ సినిమాకు నాకు ఉన్న ఆనందం ఒకటే తారక్, త్రివిక్రమ్ గార్లతో కలిసి పనిచేయడం, పెద్ద ప్రొడక్షన్ పెద్ద సినిమాలో పనిచేయడం ఒకటే. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆ సినిమాలో నా రోల్ ఏం లేదు. అసలు ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు ఈ సినిమా చేసారు అని నన్ను ఆ తరువాత చాలామంది అడిగారు. కానీ ఈ సినిమా వల్ల ఒక తెలుగమ్మాయి ఈషారెబ్బ ఉందని అందరికి ఎక్కువగా తెలిసింది. అంతే.. అంతకుమించి ఏమీ లేదు.” అని చెప్పకు వచ్చింది ఈషా రెబ్బ.


ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి