RRR main hero: ఆర్ఆర్ఆర్ లో మెయిన్ హీరో అతనే..ఎలాన్ మస్క్ క్లారిటీ..!

RRR hero debate: ఆర్ఆర్ఆర్ సినిమాపై మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎలాన్ మస్క్ ఏఐ బాట్ గ్రోక్ ఈ సినిమాలో మెయిన్ హీరో ఎవరో చెప్పింది. దీంతో తారక్, చరణ్ అభిమానుల మధ్య మళ్లీ చర్చ ప్రారంభమైంది.    

Written by - Vishnupriya | Last Updated : Mar 18, 2025, 05:08 PM IST
RRR main hero: ఆర్ఆర్ఆర్ లో మెయిన్ హీరో అతనే..ఎలాన్ మస్క్ క్లారిటీ..!

Main Hero in RRR: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం కథ, విజువల్స్, సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలై మూడేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ టాప్ 10లో నిలుస్తూ ఉంటుంది.  

Add Zee News as a Preferred Source

ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఇందులో ఇద్దరు హీరోలు సమానంగా ఉన్నారని అనుకుంటారు. కానీ తారక్, చరణ్ అభిమానుల మధ్య మెయిన్ హీరో ఎవరనే విషయంపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా, ఈ వివాదానికి మరో మలుపు వచ్చింది.  

ఎలాన్ మస్క్ కంపెనీ రూపొందించిన 'గ్రోక్' అనే ఏఐ బాట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హీరో ఎవరో ప్రశ్నించగా, జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చింది. భీమ్ పాత్ర కథను ముందుకు నడిపించిందని, మల్లిని రక్షించేందుకు కథలో ప్రధాన పాత్ర పోషించిందని గ్రోక్ చెప్పింది.  

ఈ సమాధానం వెలువడిన వెంటనే తారక్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు. ‘చివరకు ఏఐ కూడా నిజాన్ని అంగీకరించింద’ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ అభిమానులు మాత్రం కథలో అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా అంతే ముఖ్యమైనదని వాదిస్తున్నారు.  

ఇప్పటివరకు రాజమౌళి అనేక సందర్భాల్లో ఈ సినిమా ఇద్దరు హీరోలతో సమానంగా నడిపిన కథ అని స్పష్టం చేశారు. తారక్, చరణ్ ఇద్దరూ సమానమైన ప్రాముఖ్యత ఉన్న పాత్రలు పోషించారని పేర్కొన్నారు. కానీ అభిమానులు మాత్రం తమ తమ హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు.  

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఏళ్లైనప్పటికీ ఈ చర్చ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఎలాన్ మస్క్ ఏఐ బాట్ వ్యాఖ్యలతో మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. కానీ దర్శకుడు రాజమౌళి చెప్పినట్టు, ఈ సినిమా ఇద్దరు హీరోలు సమానంగా నడిపిన కథ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read: Revanth Reddy: 'శుభాకాంక్షలు నాకు వద్దు.. రాహుల్‌ గాంధీకి చెప్పండి'

Also Read: Sunita Williams: బ్రేకింగ్ న్యూస్, సునీతాను ప్రధాని మోదీ ఆహ్వానం, మీరు ఎప్పుటికీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News