మూవీ రివ్యూ: ఎంపురాన్, లూసీఫర్ (Empuraan - Lucifer 2)
నటీనటులు: మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమార్, అభిమన్యు సింగ్, మంజు వారియర్, తదితరులు
సంగీతం: దీపక్ దేవ్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటర్: అఖిలేష్ మోహన్
నిర్మాతలు: సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్, గోకులన్ గోపాలన్
దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్
విడుదల తేది: 27-3-2025
మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసీఫర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇపుడా మూవీకి సీక్వెల్ గా ‘ఎంపురాన్ - లూసీఫర్ 2’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా లూసీఫర్ మాదిరి థ్రిల్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
పీకే రామ్ దాస్ (సచిన్ ఖేడ్ కర్) తర్వాత అతని వారసుడిగా UFI పార్టీ తరుపున అతని కుమారుడైన జితిన్ రామ్ దాస్ (టోవినో థామస్) ను ముఖ్యమంత్రి చేయడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది.దానికి కొనసాగింపుగా UFI అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న జితిన్ రామ్ దాస్.. తాను యూఎఫ్ఐ పార్టీ నుంచి వైదొలుగుతున్న ప్రకటిస్తాడు. అంతేకాదు ఉత్తరాదికి చెందిన బలరాజ్ అలియాస్ బాబా బజరంగీకి (అభిమన్యు సింగ్ ) చెందిన అఖండ శక్తి మోర్చా అనే హిందూత్వ పార్టీతో పాటు మరో పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటిస్తాడు. ఈ నేపథ్యంలో జితన్ రామ్ రామ్ దాస్ తన తండ్రి ఆశయాలకు విరుద్ధంగా అఖండ శక్తి మోర్చాతో పొత్తు పెట్టుకోవడాన్ని UFI పార్టీ క్యాడర్ సహించలేక పోతుంది. మొత్తంగా తన తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచిన తమ్ముడని ఎక్కడో విదేశాల్లో ఉన్న స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ అబ్రహం ఖురేషి తన చెల్లె అయిన ప్రియదర్శి రామ్ దాస్ ను తమ్ముడి ప్లేస్ లో ఎలా పార్టీ ప్రెసిడెంట్ ను చేసాడు. ఈ క్రమంలో అఖండ శక్తి మోర్చా పార్టీ అధినేత బాబా బజరంగీ ఎవరు.. ? అతనికి అబ్రహం ఖురేషీ రైట్ హ్యాండ్ జాయేద్ (పృథ్వీరాజ్ సుకుమార్)కు ఉన్న సంబంధం ఏమిటి..? బజరంగీ అలియాస్ బలరాజ్ తో ఎలాంటి పగ ఉందనేదే తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ లూసీఫర్ కథను ఎంతో గ్రిస్పింగ్ గా పకడ్బందీగా పొలిటికల్ గా మెప్పించాడు. ఇకో రెండు పార్ట్ ‘ఎంపురాన్’ అనే టైటిల్ తో తెరకెక్కించాడు. ఇక్కడ లూసీఫర్ అంటే దండించే వాడు. స్వర్గం నుంచి బహిష్కరించిన వాడు అనే అర్ధం ఉంటే... ఎంపురాన్ అంటే.. దైవం కంటే తక్కువ.. రాజు కంటే ఎక్కువ అనే అర్ధంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో స్టార్టింగ్ లో మైనారిటీ వర్గం వాళ్లపై మెజారిటీ వర్గం వాళ్లు దౌర్జన్యంతో హీరో కుటుంబాన్ని దారుణంగా చంపివేయబడతారు. ఏదో కావాలనే ఇరికించి ఓ మెజారిటీ వర్గం వారిని శత్రువులుగా.. మైనారిటీ వర్గాన్ని బాధితులుగా చూపించాడు. మన దేశంలో బెంగాల్, కశ్మీర్, కేరళలో మెజారిటీ వర్గీయులుగా చెప్పుకుంటున్న వాళ్లు మైనారిటీలుగా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. అలాంటివి చూపించకుండా.. కావాలనే కథకు అవసరం లేకపోయినా.. మెజారిటీ అంటే హిందూ వర్గాన్నికావాలనే కించపరిచేలా ఈ సీన్స్ రాసుకున్నట్టు కనిపిస్తుంది.
మరోవైపు ఫస్ట్ పార్ట్ లో లూసీఫర్ లో కథ ఎంతో పకడ్బందీగా తెరకెక్కించాడు. కానీ ఎంపురాన్ విషయంలో కథను పక్కన పెట్టి .. ఎలివేషన్ సీన్స్ పైనే ఎక్కువ కాన్సట్రేషన్ చేసినట్టు కనిపిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి గంట వరకు హీరో కనిపించడు. హీరో ఇంట్రడక్షన్ సీన్ లో భారీ యుద్ధ విమానాలతో డ్రగ్స్ ను ఆయుధాలను తీసుకెళ్తున్న కంటెనర్స్ ను లేపెట్టేస్తాడు. అసలు .. కేరళలోని ఓ వ్యక్తి.. ఇంటర్నేషనల్ మాఫియా లీడర్ గా ఎలా ఎదిగాడు. అతనికి బ్రిటన్ కు చెందిన సీక్రెట్ ఏజెంట్ MI6 తో ఎలాంటి అనుబంధం ఏమిటి.. ? ఇంత చేస్తున్న అబ్రహం ఖురేషీని భారత నిఘా వ్యవస్థ ‘రా’ అతన్ని కనిపెట్టలేదా అనే డౌట్స్ వస్తాయి. ముఖ్యంగా హీరో తండ్రి పీకే రామ్ దాస్ హిందూవు. హీరో మాత్రం క్రిష్టియన్స్ చర్చ్ ఫాదర్ గా పెరుగుతాడు కాబట్టి.. స్టీఫెన్ నెడుంపల్లి అనే పేరు ఉంటుంది. అతను అజ్ఞాతంలో వెళ్లినపుడు అబ్రహం ఖురేషీ ఎలా అయ్యాడు. ఇలాంటి డౌట్స్ అన్ని ప్రేక్షకుల మదిని తొలిచేస్తాయి. అసలు హీరో హిందువా.. క్రిస్టియనా.. ముస్లిమా అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న. ఫస్ట్ పార్ట్ లో రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు చూపించిన పృథ్వీరాజ్ సుకుమార్.. ఇందులో తను చిన్నపుడు తన ఫ్యామిలీని చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడంతోనే రెండో పార్ట్ ముగించాడు. కొన్ని సీన్స్.. మోహన్ లాల్, టోవినో థామస్ మధ్య సీన్స్ లో దైవ పుత్రుడు, దత్త పుత్రుడు అనే డైలాగ్స్.. మనకు జగన్, పవన్ లను గుర్తుకు తెస్తుంది. మరోవైపు కొన్ని సీన్స్ చూస్తుంటే.. జగన్, షర్మిలను గుర్తుకు వస్తాయి. ఇక చివరల్లో ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ఎంపురాన్ 3 రాబోతున్నట్టు చూపించాడు. ముంబైలో స్టీఫెన్ నెడుంపల్లి.. ఎలా డాన్ గా ఎదిగాడనేది చూపించబోతున్నట్టు ముగించాడు.
పైగా కేరళలో అఖండ శక్తి మోర్చాను అనే హిందూ పార్టీ కేరళలో అడుగుపెట్టడాన్ని ఏదో అంటరాని పార్టీ గా చూపించడంలో ఆంతర్యం ఏమిటో అనేది తెలియాలి. మరోవైపు మోహన్ లాల్ ను, తన సీన్స్ ను చక్కగా తెరపై చూపించాడు. హాలీవుడ్ లెవల్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ మాస్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఆర్ఆర్ బాగుంది.
నటీనటుల విషయానికొస్తే..
మోహన్ లాల్ .. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ అబ్రహం ఖురేషీ పాత్రలో మెప్పించాడు. తాను ఎంత గొప్ప నటుడో ఈ సినిమాతో ప్రూవ్ అయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నంత తన హీరోయిజం చూపించాడు. జితిన్ రామ్ దాస్ పాత్రలో నటించిన టోవినో థామస్ తన పాత్రుకు న్యాయం చేశాడు. నెగిటివ్ పాత్రలో ఒదిగిపోయాడు. మంజు వారియర్ తన పరిధి మేరకు నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా నటించిన అఖండ శక్తి మోర్చా నాయకుడు బాబా బజరంగీ అలియాస్ బలరాజ్ పాత్రలో అభిమన్యు సింగ్ జీవించాడు. ఈయన క్యారెక్టర్ తో హీరో ఎలివేషన్స్ పండాయి. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
మోహన్ లాల్ నటన
నిర్మాణ విలువలు
ఎలివేషన్ సీన్స్
మైనస్ పాయింట్స్
కథ, స్లో నేరేషన్
లాజిక్ లేని సీన్స్
సినిమా నిడివి
పంచ్ లైన్..లాజిక్ కు అందని ‘ఎంపురాన్ - లూసీఫర్ 2’
రేటింగ్: 2.5/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









