)
Erra Cheera Movie Updates: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించిన మూవీ 'ఎర్రచీర'. 'ది బిగినింగ్' అనేది ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో ఆయన ఓ కీలక పాత్రలో కూడా నటిస్తూ నిర్మించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఈ నెల 25న విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో ఈ సినిమాను తాజాగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వేసవి కానుకగా మే రెండో వారంలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత సుమన్ బాబు మాట్లాడుతూ.. ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఎర్రచీర కొన్ని టెక్నికల్ కారణాలతో వాయిదా వేస్తున్నామని తెలిపారు. మే నెలలో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. కంటెంట్ మాత్రం ఖతర్నాక్‌గా ఉంటుందని చెప్పారు. కామెడీ, హార్రర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్ని కలగలిపి.. ఎక్కడా బోర్ కొట్టకుండా సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ప్రేక్షకులు సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుని బయటకు వెళతారని అని చెప్పగలనని అన్నారు.
సెన్సార్ సభ్యులు సినిమాను చూసి మెచ్చుకున్నారని ఆయన చెప్పారు. భలే సినిమా చేశారని ప్రశంసించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ కాంటెస్ట్‌ను అనౌన్స్ చేశారు. సినిమా కథను కరెక్ట్‌గా గెస్ చేసి రిలీజ్‌కు ముందు చెబితే రూ.5 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు. 80192 46552 నంబర్‌కు కథ పంపించాలని.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నామన్నారు. కుటుంబంతో కలిసి అందరూ హాయిగా చూడొచ్చని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి