
Singer Kalpana Suicide Attempt: ఫెమస్ సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని నిజాంపేటలో నివాసం ఉంటున్న ఆమె.. ఈరోజు మధ్యహ్నం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గత రెండు రోజుల నుంచి ఆమె ఉంటున్న ఇంటి డోర్ లు తెరవక పోవడంతో చుట్టుపక్కల వారు అసోసియేషన్ వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి డొర్ ను తెరిచేందుకు ప్రయత్నించిగా కూడా డోర్ ఓపెన్ చేయలేదు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి డోర్ ను పగల కొట్టి సింగర్ ను బైటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో అందర్ని షాకింగ్ కు గురిచేసేదిగా మారింది.
పోలీసులు చెన్నైలో ఉన్న భర్తకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో సింగర్ కల్పన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సింగర్ కల్పనకు వెంటిలేటర్ పైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe