February Telugu Releases: ఫిబ్రవరిలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు వాయిదా..!

February Tollywood Releases: ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన కొన్ని తెలుగు సినిమాలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఈ మార్చబడిన రిలీజ్ డేట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Written by - Vishnupriya | Last Updated : Feb 3, 2025, 11:32 AM IST
February Telugu Releases: ఫిబ్రవరిలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు వాయిదా..!

February Tollywood Releases 2025: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిత్రాల విడుదల తేదీల మార్పులు సాధారణమైన విషయమే. కొన్ని సినిమాలు నిర్మాణ కారణాల వల్ల ఆలస్యమవుతుండగా, మరికొన్ని పోటీని దృష్టిలో ఉంచుకొని రిలీజ్ తేదీలను మార్చుకుంటాయి. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన కొన్ని ముఖ్యమైన సినిమాలు ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Add Zee News as a Preferred Source

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన "తండేల్" సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. కాగా ఈ సినిమా విడుదల తేదీ ఎట్టి పరిస్థితిలో మారదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.  

ఇక విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన "లైలా" చిత్రం ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనున్న ఈ సినిమా కొత్త తరహా కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే, ఈ సినిమాపై ప్రేక్షకులలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇక ఈ చిత్రం విడుదల తేదీ కూడా మారేతట్టు కనిపివ్వటం లేదు. అయితే ఈ రెండు సినిమాలు మినహా మిగతా అన్ని సినిమాల విడుదల డేట్స్ తప్పకుండా వాయిదా పడేలానే ఉన్నాయి 

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన "దిల్ రుబా" సినిమా కూడా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాపై ప్రచారం అంతగా జరగలేదు. దీంతో విడుదల తేదీలో మార్పు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించిన "భైరవం" సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

సందీప్ కిషన్ హీరోగా నటించిన "మజాకా" సినిమా ఫిబ్రవరి 21న విడుదల కావాల్సి ఉంది. కానీ లాంగ్ వీకెండ్ ని ఉపయోగించుకోవడానికి చిత్రబృందం ఫిబ్రవరి 26న విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.  

మరి ఈ మూడు సినిమాలు వాయిదా పడి కొంచెం లేటుగా విడుదలై విజయం సాధిస్తాయా లేదా చూడాలి.

Also Read: Tirumala Ratha Saptami: రథ సప్తమి పర్వదినం సందర్బంగా తిరుమలలో ఏడు వాహనాలపై ఊరేగనున్న మలయప్ప స్వామి..

Also Read: Telangana BC Survey: ఇవాళే కులగణన నివేదిక.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News