Mukkuraju Master: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజుఅలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం అట్టహాసంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ముక్కురాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, తో పాటు అనిల్ కుమార్, టీఎఫ్‌టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డాన్సర్స్ యూనియన్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు టీఎఫ్‌టీడీడీఏ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ తెలిపారు.
విగ్రహ ఆవిష్కరణ అనంతరం.. ముఖ్య అతిథి ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ముక్కురాజు తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మెజారిటీ చిత్రాలకు ఆయనే కొరియోగ్రఫీ అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఈ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే మహాభాగ్యాన్ని నాకు కల్పించిన అసోసియేషన్ పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అసోసియేషన్ ఇంత గొప్పగా అవడానికి కారణం ముక్కురాజు మాస్టర్. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ ముందు వరసలో ఉంటారన్నారు. ఆయనలోని మానవీయకోణానికి శిరస్సువంచి నమస్కారం చేస్తున్నట్టు చెప్పారు. . ఎంతోగొప్పతనం ఉన్న మంచి మనిషి. 24 క్రాఫ్ట్ వస్తేనే ఇండస్ట్రీ అభివృద్ధి సాధ్యం. తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాలను తలదన్నే స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ఇలాంటి మహానుభావులే అన్నారు. 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ ఏర్పాటు కోసం 1991లో ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది డ్యాన్సర్స్ అసోసియేషన్ స్థాపించడం. ఆ తర్వాత ఒక్కో యూనియన్ వచ్చాయి. నా ప్రతి సినిమాలోనూ ముక్కురాజు మాస్టర్ పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే నాకు ఇవాళ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కలిగిందన్నారు. అసోసియషన్‌లో ప్రస్తుతం 600 మంది డ్యాన్సర్స్ ఉన్నారంటే ముక్కురాజు మాస్టర్ వేసిన బలమైన పునాదే కారణమన్నారు. సినీ పరిశ్రమలోని కార్మికులందరికీ చిత్రపురి కాలనీలో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..‘‘ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఈరోజు ఫిల్మ్ ఫెడరేషన్ లేదు. డ్యాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్ లేకుండా ఫెడరేషన్ పూర్తి అయ్యేది కాదు. ఆ సమయంలో ఏ నమ్మకంతోనో ముక్కురాజు మాస్టర్ వచ్చి డ్యాన్సర్స్ యూనియన్ స్టార్ట్ చేశారు. వీళ్ల కష్టంతోనే ఇవాళ అసోసియేషన్ ఉందన్నారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘ముక్కురాజు మాస్టర్ గారిని నేను 1986లో తొలిసారి కలిశాను. నాకున్న టెంపర్‌కు ఒక డ్యాన్సర్‌తో గొడవ జరిగితే ఆయన వచ్చి సెటిల్ చేశారన్నారు. అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఏర్పడిందన్నారు.ఆయన విగ్రహ ఆవిష్కరణకు రావడం తన అదృష్టమన్నారు. ఈ సందర్భంగా వీర శంకర్ తో పాటు పలు అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో ముక్కురాజు ఘనతను కొనియాడారు. ముక్కురాజు మాస్టర్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









