Star Heroine Who Caught in Trash:
ఎవరి జీవితం ఎప్పుడూ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి . ఒక బాలీవుడ్ హీరో వార్తాపత్రికలో ఒక వార్తను చదివి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వార్తాపత్రిక సారాంశం ఏమిటంటే.. చెత్త బుట్టలో ఒక అమ్మాయి అని ఒక వార్త వైరల్ అవ్వగా.. అది చూసిన స్టార్ హీరో ఆ అమ్మాయిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.ఇక వెంటనే తన భార్యకు తన కోరిక గురించి చెప్పగా ఆమె కూడా ఓకే చెప్పింది. వెంటనే ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం ఆ చెత్త బుట్టలో దొరికిన అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇక ఆ అమ్మాయి ఇప్పుడు పెద్దదైపోయింది. మరి ఆ దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న స్టార్ నటులు ఎవరు? ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తోంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
వారెవరో కాదు మిథున్ చక్రవర్తి. ఆయన దత్తత తీసుకున్న అమ్మాయి ఎవరో కాదు దిశాని చక్రవర్తి. మిథున్ చక్రవర్తికి మహాక్షయ్, ఉష్మే, నమాషి అనే ముగ్గురు కొడుకులు మాత్రమే కాదు దిశాని చక్రవర్తి అనే అందమైన అమ్మాయి కూడా ఉంది. ఈమెను దత్తత తీసుకున్నారు వీరు. ఇది చాలా మందికి తెలియదు. ఈమె ఎవరో కాదు చెత్తబుట్టలో దొరికిన ఆ దిశానిచక్రవర్తి. వాస్తవానికి ఈమె కోల్కతాలో జన్మించింది. ఈమె పుట్టిన తర్వాత ఈమె తల్లిదండ్రులు చెత్తబుట్టలో పడేయడంతో ఆ సమయంలో ఒక బెంగాలీ వార్తాపత్రిక నవజాత శిశువును ఆమె కుటుంబం చెత్తబుట్టలో వదిలేసిందని ఒక వార్తను ప్రచురించింది.
కొంతమంది బాటసారులు శిశువు చెత్తబుట్టలో ఉండడం గమనించారు. మరుసటిరోజే వారిలో ఒకరు శిశువుని ఇంటికి తీసుకెళ్లారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్త చదివిన తర్వాత మిథున్ తన భార్య యోగిత బాలితో కలిసి ఆ బిడ్డను దత్తత తీసుకున్నారు. ఇక అప్పటినుంచి ఈ శిశువు మొత్తం కుటుంబానికి ప్రియమైన వ్యక్తిగా మారిపోయింది. మిథున్ తన కుమార్తెను చాలా ప్రేమించేవాడు.
ఇక దిశాని తన ప్రాథమిక విద్యను భారత దేశంలోనే పూర్తి చేసి ఉన్నత విద్య కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కి వెళ్ళిపోయింది. అక్కడ న్యూయార్క్ ఫిలిం అకాడమీ నుండి నటనలో పట్టభద్రురాలయింది. చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి పెంచుకున్న ఈమె ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
హాలీవుడ్ చిత్రంతో తన నటనను ప్రారంభించిన ఈమె 2017లో విడుదలైన గిఫ్ట్ అనే షార్ట్ ఫిలిమ్ తో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హోలీ స్మోక్, అండర్ పాస్, వై డిడ్ యు డు ఇట్ , టూ ఫేస్డ్ వంటి లఘు చిత్రాలలో నటించింది .చివరిసారిగా ది గెస్ట్ అనే షార్ట్ ఫిలింలో కనిపించిన ఈమె ఈ షార్ట్ ఫిలిం తో భారీ ప్రశంసలు అందుకుంది.
Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!
You May Like
దీన్ని ఒక్కసారి తినండి మీ పురుష బలం 10 రెట్లు పెరుగుతుంది.TANTRA MAX
బరువు తగ్గడానికి సులభమైన మార్గం - రాత్రికి కేవలం ఒక చెంచా!ONE TWO SLIM
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









