
Sikandar Movie Leak: ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా ఒక్కసారిగా ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. విడుదలకు ఒక రోజు ముందే నెట్లో ప్రత్యక్షమవడంతో చిత్ర బృందం దిగ్భ్రాంతికి లోనయ్యింది. రంజాన్ పండుగ సందర్భంగా విడుదల కావాల్సిన సినిమా ఆన్లైన్లో కనిపించడంతో సినిమా బృందం అవాక్కయ్యింది. దీంతో చిత్రబృందం పోలీసులను ఆశ్రయించింది. బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ సినిమాకు ఎదురవడం కలకలం రేపుతోంది.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ భాయ్‌గా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్ నటించిన సినిమా 'సికందర్' ఆదివారం థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే విడుదలకు ఒక రోజు ముందే ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. పైరసీ నేరగాళ్లు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. చాలా సైట్లలో సికందర్ సినిమా ప్రత్యక్షమవడంతో సినీ విమర్శకుడు వెలుగులోకి తీసుకువచ్చాడు. సినిమా పలు వెబ్సైట్లలో లీకయ్యిందని చెప్పడంతో సికందర్ సినిమా బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
'చాలా వెబ్సైట్లలో శనివారం రాత్రి సికందర్ సినిమా ప్రదర్శితమైంది. ఇంటర్నెట్లో ఈ సినిమాను వెంటనే తొలగించాలని అధికారులను కోరినా ప్రయోజనం లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది' అని ఆ సినీ విమర్శకుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా రూపొందించారు. రష్మిక మందాన్న జోడిగా సల్మాన్ నటించాడు. కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. పైరసీ విషయం పక్కనపెడితే థియేటర్లలో విడుదలైన సికిందర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. దీంతో సల్మాన్ ఖాతాలో రంజాన్ పండుగకు మరో విజయం లభించిందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe