)
GAMA Awards List: దుబాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA Awards) టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. ఆగస్టు 30న షార్జా ఎక్స్పో సెంటర్లో వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో Keinfra Properties ఆధ్వర్యంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటులు, దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకకు హాజరై ఉత్సాహాన్ని నింపారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.
ఈ ఏడాది గామా అవార్డ్స్‌లో ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ చిత్రం దాదాపు అన్ని విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి బెస్ట్ మూవీ అవార్డు దక్కగా, అల్లు అర్జున్ గామా బెస్ట్ యాక్టర్‌గా నిలిచారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు సుకుమార్‌కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది. సంగీతం విభాగంలో దేవిశ్రీప్రసాద్ మరోసారి తన ప్రతిభను చాటుతూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.
ముఖ్య గామా అవార్డ్స్ 2025 విజేతలు:
బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప 2 ది రూల్)
బెస్ట్ హీరోయిన్: మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ మూవీ: పుష్ప 2 ది రూల్
బెస్ట్ డైరెక్టర్: సుకుమార్ (పుష్ప 2)
బెస్ట్ ప్రొడ్యూసర్స్: అశ్వినీ దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898AD)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2)
బెస్ట్ కొరియోగ్రఫీ: భాను మాస్టర్ (మిస్టర్ బచ్చన్)
బెస్ట్ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: రత్న వేలు (దేవర)
అదే విధంగా రజాకార్ చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు దక్కగా, తేజ సజ్జా బెస్ట్ యాక్టర్ క్రిటిక్‌గా ఎంపికయ్యారు. యువ నటీనటులలో రోషన్, శ్రీదేవి, మానస వారణాశి ప్రామిసింగ్ యాక్టర్స్‌గా గుర్తింపు పొందారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నిర్మాత అశ్వినీ దత్‌కు లభించింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గ్లోబల్ కమెడియన్ అవార్డును అందుకున్నారు.
ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డు ఊర్వశీ రౌటెలకు దక్కగా, హీరో సత్యదేవ్ జీబ్రా చిత్రానికి ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో ఫరియా అబ్దుల్లా, ఊర్వశీ రౌటెల, మానస వారణాశి ప్రత్యేక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. యాంకర్ సుమ, హర్ష వినోదాత్మక వ్యాఖ్యలతో కార్యక్రమానికి మరింత అందాన్ని తెచ్చారు.
గామా సీఈఓ సౌరభ్ మాట్లాడుతూ “గత కొన్నేళ్లుగా గామా అవార్డ్స్ తెలుగు, తమిళ, మళయాళ సినీ అభిమానుల మధ్య విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ విజయానికి తోడ్పడిన అందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.